News December 31, 2024

వేడుకల్లో హద్దు మీరితే చర్యలు: ప్రకాశం SP

image

ప్రకాశం జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులకు ఎస్పీ ఏఆర్ దామోదర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 31వ తేది సాయంత్రం నుంచి అన్ని ముఖ్య కూడళ్లలో పోలీస్ పికెట్స్, నైట్ గస్తీ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పోలీస్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News January 21, 2025

ప్రకాశం: నవోదయ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

image

ప్రకాశం జిల్లాలోని నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్ష రాసే 9, 11వ తరగతి విద్యార్థులు హాల్ టికెట్లు తీసుకోవాలని DEO కిరణ్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9వ తరగతి ప్రవేశానికి 2456 మంది, ఇంటర్ (11) వ తరగతి ప్రవేశానికి 3225 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. హాల్ టికెట్లు https://cbseitms.nic.in/2024/nvsix/AdminCard/AdminCard25 వెబ్ సైట్‌లో పొందవచ్చని తెలిపారు.

News January 21, 2025

ప్రకాశం: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కొత్త మెనూ

image

ప్రకాశం జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూను ప్రభుత్వం సవరించింది. సోమవారం ప్రకటించిన మెనూ వివరాలివి.
➤సోమవారం:తెల్ల అన్నం, సాంబారు, చిక్కీ, ఎగ్ ఫ్రై.
➤మంగళవారం: పులిహోర, పుదీనా చట్నీ, ఎగ్, రాగిజావ.
➤బుధవారం తెల్ల అన్నం, కూర, ఎగ్, చిక్కీ.
➤గురువారం: పలావు, గుడ్డు, రాగిజావ.
➤శుక్రవారం: తెల్ల అన్నం, కోడి గుడ్లకూర.
➤శనివారం: అన్నం, టమోటా పప్పు/ పప్పుచారు, తీపి పొంగల్, రాగిజావ.

News January 21, 2025

ఒంగోలు: ‘కలెక్టరమ్మా.. కొడుకులు అన్నం పెట్టడం లేదు’

image

‘తల్లీ కలెక్టరమ్మా నాకు మీరే దిక్కు’ అంటూ కలెక్టర్ తమిమ్ అన్సారియాను సోమవారం ఓ వృద్ధురాలు కలెక్టర్ కార్యాలయంలో వేడుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద టంగుటూరు మండలం నిడమానూరుకి చెందిన తంపనేని సౌభాగ్యమ్మ అనే వృద్ధురాలు జిల్లా కలెక్టర్‌తో తన బాధను పంచుకుంది. కన్న కొడుకులే అన్నం పెట్టడం లేదని, కలెక్టరమ్మా మీరైనా తనకు న్యాయం చెయాలంటూ ఆ వృద్ధురాలు వేడుకుంది.