News January 6, 2025

వేడేక్కిన కృష్ణాజిల్లా రాజకీయం 

image

కృష్ణాజిల్లాలో రాజకీయం మరోసారి వేడేక్కింది. నూజివీడులో YCP నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారని MLA యార్లగడ్డ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నూజివీడు TDP నాయకులు స్పందించారు. యార్లగడ్డ తన నియోజకవర్గం చూసుకోవాలని పార్థసారథి వర్గీయులు నిన్న వార్నింగ్ ఇచ్చారు. పక్క నియోజకవర్గాలపై అసత్య ప్రచారం మానుకోవాలన్నారు. కాగా సారథి వర్గీయుల వ్యాఖ్యలపై యార్లగడ్డ వర్గం కౌంటర్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Similar News

News January 18, 2025

విజయవాడ: ఈ-లాటరీలో రిటర్నబుల్ ఫ్లాట్ల అందజేత 

image

రాజధాని అమరావతికి భూమినిచ్చిన రైతులకు శుక్రవారం విజయవాడ CRDA కార్యాలయంలో రిటర్నబుల్ ప్లాట్లు అందజేశారు. ఈ మేరకు 39 మందికి ఈ- లాటరీ విధానంలో రాజధాని అమరావతిలో 72 ఫ్లాట్లు ఇచ్చామని కార్యక్రమం నిర్వహించిన జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవతేజ తెలిపారు. రిటర్నబుల్ ఫ్లాట్లు పొందిన రైతులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సౌకర్యవంతంగా జరిగేందుకు అమరావతిలో తొమ్మిది రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. 

News January 18, 2025

ఆ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదు: SP 

image

కృష్ణా జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు హాజరవ్వాల్సిన పురుష అభ్యర్థులకు SP ఆర్. గంగాధర్ కీలక సూచన చేశారు. పురుష అభ్యర్థులకు మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో దేహదారుఢ్య పరీక్షలు ఈనెల 20 వరకు మాత్రమే నిర్వహిస్తామన్నారు. పురుషులకు సంబంధించి నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి పొడిగింపులకు అవకాశం లేదని, కానిస్టేబుల్ అభ్యర్థులు గమనించాలని SP ఆర్. గంగాధర్ తెలిపారు. 

News January 17, 2025

హెల్మెట్ వినియోగం తప్పనిసరి: కలెక్టర్

image

జాతీయ రహదారులపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై కమిటీ సమీక్షించింది.