News August 7, 2024

వేదవతి ప్రాజెక్టును పీఎంకేసీవై పథకంలోకి చేర్చండి: కర్నూలు ఎంపీ

image

కర్నూలు జిల్లాలోని వేదవతి ప్రాజెక్టును ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన పథకం కింద చేర్చాలని కేంద్ర జలశక్తి మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌ను కర్నూలు ఎంపీ నాగరాజు కోరారు. బుధవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 80 వేల ఎకరాలకు నీరు అందించవచ్చని, అధిక సంఖ్యలో రైతులకు లబ్ధిచేకూరి వలసలను అరికట్టవచ్చని తెలిపారు.

Similar News

News January 23, 2025

నైపుణ్యాలను వెలికి తీయండి: కలెక్టర్

image

విద్యార్థుల్లో ఉన్న ప్రతిభాపాటవాలను నైపుణ్యాలను వెలికితీయాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అన్నారు. బుధవారం కర్నూలులోని కలెక్టరేట్లోని బాలోత్సవం-2025 పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఎక్కువ మంది విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని బాలోత్సవ కమిటీ నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో బాలోత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు డీ.ధనుంజయ, జేఎన్ శేషయ్య పాల్గొన్నారు.

News January 22, 2025

12వ రోజు 286 మంది అభ్యర్థుల ఎంపిక

image

ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్లో 12వ రోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. 600 మంది అభ్యర్థులకు గాను 415 మంది అభ్యర్థులు బయోమెట్రిక్‌కు హజరయ్యారన్నారు. ఫైనల్ పరీక్షకు 286 మంది అభ్యర్థులు అర్హత సాధించారని ఎస్పీ తెలిపారు.

News January 22, 2025

రూ.291.67 కోట్లతో కర్నూలు నగరపాలక అంచనా బడ్జెట్‌

image

కర్నూలు నగరపాలక సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనాల బడ్జెట్‌ను స్థాయీ సంఘం ఆమోదించింది. నగరపాలక కార్యాలయంలో మేయర్ బీవై రామయ్య అధ్యక్షతన స్థాయీ సంఘ సమావేశం బుధవారం నిర్వహించారు. రూ.291.67 కోట్లతో బడ్జెట్ రూపకల్పన చేశారు. మొత్తం ఆదాయం రూ.363.99 కోట్లు, ఖర్చు రూ.201.22 కోట్లు, రెవెన్యూ ఆదాయం రూ.201.22 కోట్లు, ప్రభుత్వ గ్రాంట్లు రూ.162.77 కోట్లు, మూలధన రాబడి రూ.138.69 కోట్లు.