News September 28, 2024
వేదాయపాలెం రైల్వే స్టేషన్‌లో వృద్ధురాలు

నెల్లూరు నగరం వేదయపాలెం రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలను వదిలేసి వెళ్లినట్టు ప్రయాణికులు తెలిపారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ప్రయాణికులు 108 సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. ఆమెను వివరాలు అడగగా.. తన పేరు బుజ్జమ్మని మిగిలిన వివరాలు చెప్పలేకపోయిందని అధికారులు తెలిపారు.
Similar News
News November 24, 2025
VPR దంపతులను కలిసిన జడ్పీ సీఈవో

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులను నూతన జడ్పీ సీఈవో శ్రీధర్‌రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆయన్ను జిల్లా పరిషత్‌కు కొత్త సీఈవోగా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో నగరంలోని వీపీఆర్ నివాసానికి వచ్చిన ఆయన వేమిరెడ్డి దంపతులను కలిసి బొకే అందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వేమిరెడ్డి సూచించారు.
News November 24, 2025
కాసేపట్లో నెల్లూరుకు మంత్రి సత్యకుమార్ రాక

మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈనెల మంగళవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఇవాళ రాత్రి 9 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారన్నారు. రాత్రికి ఇక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం విలుకానిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.. సాయంత్రం వరకు అక్కడే కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.