News April 6, 2024

‘వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు’

image

ఖమ్మం జిల్లాలో మహిళలు, బాలికలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. మహిళలను వేధింపుల నుంచి రక్షించేందుకు కమిషనరేట్ పరిధిలో షీ టీమ్లతో భరోసా కల్పిస్తామన్నారు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసానిచ్చారు. మహిళలు ఎప్పుడైతే అభద్రతకు లోనవుతారో డయిల్ -100, షీటీమ్ నంబర్ 87126 59222కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Similar News

News December 9, 2025

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

image

ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. అలాగే తెలంగాణ గేయాన్ని ఉద్యోగులందరూ ఆలపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారిణి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

News December 9, 2025

తొలి విడత ఎన్నికలకు భారీ భద్రత: ఖమ్మం సీపీ

image

మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ నెల 11న జరిగే ఎన్నిక కోసం 2 వేల మంది సిబ్బందితో పహారా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 953కేసుల్లో 6,403 మందిని బైండోవర్ చేశామన్నారు. రూ.12 లక్షల విలువైన 1,200 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. 16 సరిహద్దు చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు చేపడుతున్నామని కమిషనర్ వివరించారు.

News December 9, 2025

ముదిగొండ: కోతులు, కుక్కల బెడద నివారించేవారికే ఓటు!

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముదిగొండలో యువకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గ్రామంలో తీవ్రంగా ఉన్న కోతులు, కుక్కల బెడదను నివారించే అభ్యర్థికే తమ ఓటు వేస్తామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ సామాజిక సమస్యను పరిష్కరించడానికి ఎవరైతే స్పష్టమైన హామీ ఇస్తారో వారినే గెలిపిస్తామని యువకులు స్పష్టం చేశారు. వారి ఈ నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశమైంది.