News February 25, 2026
వేధింపుల కేసులో కృష్ణాజిల్లా కానిస్టేబుల్‌కి రిమాండ్

కృష్ణాజిల్లా APSRTCలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేకల నరేంద్రను మంగళవారం నాదెండ్ల పోలీసులు అరెస్టు చేశారు. మండలానికి చెందిన ఓ యువతిని ఆయన వేధింపులకు గురి చేస్తున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండి చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడడంతో కేసుకు ప్రాధాన్యత సంతరించుకుంది. నరేంద్రను బుధవారం చిలకలూరిపేట కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు.
Similar News
News April 14, 2026
నేను రఫ్ డాడీని: రామ్ చరణ్

పిల్లలే తన ప్రాణమని, వాళ్లు లేకపోతే ఇల్లు బోసిపోయినట్లు ఉంటుందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. ‘నేను రఫ్ డాడీని. పిల్లల్ని గంతులేయనివ్వడం, ఎక్కనివ్వడం, రిస్క్ తీసుకోనివ్వడం వంటివి చేస్తాను. వారితో సమయం గడిపే తండ్రిగా ఉండాలనుకుంటా. నా ప్రపంచాన్ని కాస్త చిన్నదిగా, పరిమితంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తా’ అని Esquire India ఇంటర్వ్యూలో చెప్పారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
News April 14, 2026
జనగామ: ఇంటర్‌లో టైలర్ కూతురు భవానికి 988 మార్కులు!

ఇంటర్మీడియట్ ఫలితాల్లో జనగామ(D) చిల్పూర్(M) చిన్న పెండ్యాలకు చెందిన పేరాల భవాని అద్భుత ప్రతిభ కనబరిచింది. తండ్రి ప్రభాకర్ టైలరింగ్ చేస్తూ చదివిస్తుండగా, తండ్రి కష్టాన్ని గుర్తించిన భవాని టీఎస్‌ఆర్‌జేసీలో కష్టపడి చదివి 1000కి 988 మార్కులు సాధించింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అత్యధిక మార్కులు సాధించిన భవానిని గ్రామస్థులు, పలువురు ప్రముఖులు అభినందించారు.
News April 14, 2026
33% రిజర్వేషన్: మారనున్న సమీకరణాలు

రాబోయే ఎన్నికల నుంచి 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానుండటంతో జిల్లా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుంది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఉమ్మడి కర్నూలు జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 20కి పెరిగే అవకాశం ఉండగా, రిజర్వేషన్ల ప్రకారం అందులో 5-7 స్థానాలు మహిళలకు కేటాయిస్తారు. వీటిలో మహిళలకు కేటాయించే స్థానాలపై ఆసక్తి నెలకొంది. తమ స్థానాలు మహిళలకు రిజర్వ్ అవుతాయేమోనన్న టెన్షన్ నేతల్లో మొదలైంది.


