News March 14, 2025
వేమనపల్లిలో పండగ పూట విషాదం

మంచిర్యాల జిల్లాలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేమనపల్లి మండలానికి చెందిన కంపెల రాజ్ కుమార్ (20) శుక్రవారం హోలీ ఆడిన తర్వాత స్నేహితులతో కలిసి ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు.
Similar News
News April 16, 2026
దేవతలు కలలో వస్తే ఏం జరుగుతుంది?

కలలో దేవతలు కనిపించడం శుభప్రదమట. ఇది మీపై దైవానుగ్రహం ఉందని, త్వరలోనే మీ సమస్యలు తొలగిపోతాయని సూచనట. అలాగే శుభవార్తలు వింటారని చెప్పడానికి సంకేతమని స్వప్నశాస్త్రం చెబుతోంది. ‘దేవతలు ఆశీర్వదిస్తున్నట్లు, చిరునవ్వుతో కనిపిస్తే తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కోపంగా ఉన్నట్లు కనిపిస్తే మీరు ఏదైనా ధర్మ కార్యంలో పొరపాటు చేస్తున్నారని, మొక్కులు మరచిపోయారని అర్థం’ అని సూచిస్తున్నారు నిపుణులు.
News April 16, 2026
మెదక్: TUWJ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జిల్లా కమిటీ

షామీర్పేట్‌లో TUWJ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి, ప్రధాన కార్యదర్శి సంతోష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టీజీ శ్రీనివాస శర్మ పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, రాష్ట్ర, జిల్లాల్లో ఎదురవుతున్న వివిధ వృత్తిపరమైన సమస్యలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
News April 16, 2026
నిప్పుల కొలిమిలా ఆదిలాబాద్

జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా ఎండ తీవ్రత స్థాయి పెరిగింది. తాంసీ, గుడిహత్నూర్‌లో అత్యధికంగా 42-44°C, ఇంద్రవెల్లి, ఉట్నూర్, గాదిగూడలో 41-43°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే సెగలు పుడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


