News December 1, 2024
వేమవరం వద్ద రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి
బల్లికురవ మండలంలోని వేమవరం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంతమాగులూరు మండలంలోని కొప్పరం గ్రామానికి చెందిన మునీర్ బాషా తన కుటుంబ సభ్యులతో కలిసి చిలకలూరిపేట నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. వేమవరం వద్ద వీరి బైక్‌ను లారీ ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ఖాన్సా (13 నెలలు) అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న బల్లికురవ పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.
Similar News
News January 15, 2025
చీరాల: గంట వ్యవధిలో గుండెపోటుతో అన్నదమ్ముల మృతి
చీరాల గొల్లపాలెంలో బుధవారం తీవ్ర విషాద ఘటన జరిగింది. గంటల వ్యవధిలో అన్నదమ్ములు గుండెపోటుతో మృతిచెందారు. గొల్లపాలెంకు చెందిన గొల్లప్రోలు గంగాధర్ (40) గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే గంగాధర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అన్నయ్య మృతి తట్టుకోలేని తమ్ముడు గోపి( 33) అదే వైద్యశాలలో గుండెపోటుతో మరణించాడు.
News January 14, 2025
పొదిలి: బలవర్మరణం కేసులో ట్విస్ట్
పొదిలి పట్టణంలో గత ఏడాది రవి అనే వక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈకేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. దళితనేత నీలం నాగేంద్రం జిల్లా ఎస్పీ దామోదర్‌ను మృతుడి భార్య సలొమితో కలిసి ఎస్సీ, ఎస్టీ కేసుగా మార్చాలని చేసిన విజ్ఞప్తి మేరకు విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం కేసును సోమవారం ఎస్సీ, ఎస్టీ కేసుగా మార్చారు.
News January 13, 2025
పర్చూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్.. మరొకరు మృతి
ఇటీవల పర్చూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి సజీవ దహనమైన అక్కాచెల్లెళ్ల గురించి మరువక ముందే వారి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కూతుళ్లను కాపాడుకునే ప్రయత్నంలో కాలిపోయి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న తల్లి దాసరి లక్ష్మీరాజ్యం కూడా తనువు చాలించింది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పర్చూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.