News March 20, 2024
వేములవాడలో ఈనెల 27 నుంచి శివ కళ్యాణోత్సవాలు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో ఈనెల 27న శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. 27 నుంచి 31 వరకు ఐదు రోజులపాటు శ్రీ శివ కళ్యాణోత్సవాలు జరపనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 30న(శనివారం) సాయంత్రం శ్రీ స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అర్చకులు తెలిపారు.
Similar News
News April 20, 2025
కరీంనగర్: పేర్లు నమోదు చేసుకోవాలి: డిప్యూటీ కమిషనర్

KNR జిల్లాలోని సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు శ్రమ్ పోర్టల్‌లో తప్పనిసరిగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్. వెంకట రమణ సూచించారు. భారత ప్రభుత్వ కార్మిక & ఉపాధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు సహా అన్ని వర్గాల కార్మికులకు సామాజిక భద్రత అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News April 20, 2025
కరీంనగర్: టెట్ అభ్యర్థుల కోసం ఉచిత విన్నర్స్ ఆన్లైన్ యాప్ ఆవిష్కరణ

కరీంనగర్లో డా. ప్రసన్న హరికృష్ణ ఆధ్వర్యంలో టెట్ అభ్యర్థుల కోసం ఉచితంగా విన్నర్స్ ఆన్లైన్ యాప్ విడుదల చేశారు. రాష్ట్రస్థాయిలో పేరు గాంచిన ఫ్యాకల్టీ లెక్చర్లు అందించనున్న ఈ యాప్ ద్వారా రూ.80 లక్షల విలువైన క్లాసులు అభ్యర్థులకు ఫ్రీగా లభించనున్నాయి. ప్లే స్టోర్‌లో డౌన్లోడ్ చేసుకొని ఆప్‌ను వీక్షించవచ్చు. ఎన్నికల్లో ఓడినా, నిరుద్యోగుల పక్షాన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రసన్న హరికృష్ణ స్పష్టం చేశారు.
News April 20, 2025
కరీంనగర్: 328 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు 328 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లాలో 2,66,896 ఎకరాలలో వరి సాగు అయిందని, 5,86,723 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ధాన్యం విక్రయ సొమ్ము, జమ కావడం కూడా ప్రారంభమైందని తెలిపారు. జిల్లాలోని 96 మిల్లులకు 4 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల మిల్లింగ్ చేసే సామర్థ్యం ఉందన్నారు.