News April 3, 2024
వేములవాడలో ఈనెల 9 నుంచి శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు

వేములవాడ రాజన్న ఆలయంలో ఈనెల 9 నుంచి 17వ తేదీ వరకు శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. 9న ఉగాది పండుగను పురస్కరించుకొని పంచాంగ శ్రవణం నిర్వహిస్తామని, పండితులకు సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. 15 నుంచి 17 వరకు భక్తి ఉత్సవాలు నిర్వహిస్తామని, సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామని వివరించారు.
Similar News
News October 24, 2025
KNR: విద్యార్థులకు పోలీసు భద్రతా అవగాహన

పోలీసు అమర వీరుల సంస్కరణ వారోత్సవాలను పురస్కరించుకొని ఇవాళ పోలీసు పరేడ్ గ్రౌండ్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థ పనితీరు, డిపార్టుమెంట్లో ఉపయోగించే ఆయుధాలు, సాంకేతిక పద్దతులు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిరు.
News October 24, 2025
KNR: గదిలో గంజాయి దాచి.. స్నేహితులతో సేవించి

కరీంనగర్ బ్యాంక్ కాలనీలో గంజాయి నిలువచేసి వినియోగిస్తున్న చిక్కులపల్లి సాయివిఘ్నేశ్ అనే యువకుడిని పట్టుకొని రిమాండ్ చేసినట్లు 3టౌన్ పోలీసులు తెలిపారు. లంబసింగి ప్రాంతం నుంచి 2కిలోల గంజాయి కొనుగోలు చేసి, తన ఇంటి టెర్రస్‌పై చిన్న గదిలో దాచిపెట్టి, తరచూ తన స్నేహితులతో కలిసి సాయివిఘ్నేశ్ గంజాయి సేవిస్తున్నాడని చెప్పారు. నమ్మదగిన సమాచారం మేరకు నిందితుడితోపాటు గంజాయిని నిన్న పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
News October 24, 2025
JMKT: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

జమ్మికుంట పత్తి మార్కెట్లో నేటి నుంచి CCI ద్వారా పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉండేలా చూసుకోవాలన్నారు. అలా అయితేన్ మద్దతు ధర పొందవచ్చన్నారు. CCI ద్వారా పత్తి అమ్ముకునే రైతులు ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకొని కొనుగోలు కేంద్రాలకు పత్తి తీసుకురావాలన్నారు. సమస్యలుంటే 18005995779, వాట్సాప్ నంబర్ 8897281111లను సంప్రదించండి.


