News January 26, 2025
వేములవాడలో ఐపీఎల్ తరహాలో మెగా ఆక్షన్

రాజన్న ప్రీమియర్ లీగ్ సీజన్ -5 పేరిట వేములవాడ పట్టణానికి చెందిన కొందరు క్రీడాకారులు మెగా ఆక్షన్ నిర్వహించారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బిగ్గెస్ట్ మెగా ఆక్షన్.. ఐపీఎల్ మెగా మాదిరిగానే నిర్వహించడంతో ఆసక్తి నెలకొంది. ఈ ఆక్షన్లో 8 టీమ్స్, 112 మంది ప్లేయర్స్ పాల్గొన్నారు. రూ.100 బేస్ ప్రైస్తో ఆటగాళ్లు బరిలోకి ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News December 7, 2025
ఖమ్మం: పంచాయతీ పోరులో ‘వాట్సాప్’ ప్రచారం జోరు

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. వారం రోజులే సమయం ఉండటంతో, అభ్యర్థులు ఓటర్లను నేరుగా కలవడంతో పాటు డిజిటల్ ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నారు. సర్పంచ్, వార్డు అభ్యర్థులు ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి, తమ గుర్తులు, ఫొ టోలతో పాటు గత సేవలు, భవిష్యత్తు హామీలను సందేశాల రూపంలో పంపుతూ పోటాపోటీగా గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
News December 7, 2025
ఖమ్మం: పంచాయతీ పోరులో హోం ఓటింగ్ ఉందా?

గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వయోవృద్ధులు, కదల్లేని దివ్యాంగుల కోసం అమలు చేసిన హోమ్ ఓటింగ్ సదుపాయంపై గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గందరగోళం నెలకొంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్నా ఈసారి ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ఆ వర్గాలలో ఆందోళన కనిపిస్తోంది. బీఎల్ఏల ద్వారా సమాచారం సేకరించి ఇంటికే సిబ్బందిని పంపి ఓటు వేసే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు.
News December 7, 2025
నంద్యాల జిల్లాలో చికెన్ ధరలు

నంద్యాల జిల్లాలో ఇవాళ కేజీ చికెన్ ధర రూ.220 నుంచి రూ.250 వరకు పలికింది. మహానంది మండలంలో స్కిన్తో కలిపి చికెన్ కేజీ రూ.220 ఉండగా, స్కిన్లెస్ రూ.220 నుంచి 230వరకు విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే నేడు రూ.10-30 పెరిగింది. గాజులపల్లెలో స్కిన్ రూ.220, స్కిన్లెస్ చికెన్ రూ.230కు విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.800 నుంచి రూ.850 పలుకుతోంది. ప్రాంతాన్ని బట్టి స్వల్పంగా మార్పులు ఉన్నాయి.


