News February 26, 2025

వేములవాడలో పటిష్ఠ భద్రత చర్యలు

image

వేములవాడలోని మహాశివరాత్రి జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ భద్రత చర్యలు చేపట్టారు. ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి సెట్ ద్వారా సూచనలు ఇస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ, క్యూ లైనలో ఉన్న భక్తులతో మాట్లాడారు. ఇబ్బందులు ఉంటే సిబ్బందితో మాట్లాడుతూ.. సులభంగా దర్శనం అయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.

Similar News

News September 16, 2025

విశాఖ పోర్ట్‌ ఛైర్మన్‌ అంగముత్తుకు బదిలీ

image

విశాఖ పోర్ట్‌ అథారిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ అంగముత్తు బదిలీ అయ్యారు. ఆయనను ముంబై పోర్ట్‌ ఛైర్మన్‌గా బదిలీ చేస్తూ కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 మేలో ఆయన విశాఖ పోర్ట్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన స్థానంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కాటమనేని భాస్కర్‌ పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సమాచారం.

News September 16, 2025

కిచెన్ గార్డెనింగ్ ఇలా చేసేద్దాం..

image

కిచెన్ గార్డెనింగ్ చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. కిచెన్ ప్లాంట్స్‌కి 3-6 గంటల సూర్యరశ్మి అవసరం. వీటిని బాటిల్స్, గ్లాస్ కంటైనర్స్‌లో పెంచొచ్చు. సారవంతమైన మట్టి, మంచి విత్తనాలు వాడాలి. అప్పుడే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆకుకూరలు, టమాటా, మిర్చి, అల్లం, బంగాళదుంప ఈజీగా పెరుగుతాయి. వీటికి సరిపడా నీరు పోయాలి. కుండీల కింద రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకూ రసాయనాలు, పురుగుమందులు వాడకూడదు.

News September 16, 2025

మెదక్: ‘బాల్యం అనేది చదువుకోవడానికే’

image

బాల్యం అనేది చదువుకోవడానికి, కలలు కనడానికి, భవిష్యత్ నిర్మించుకోవడానికి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఆర్.ఎం.శుభవల్లి అన్నారు. హవేలీ ఘనపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అమూల్యమైన దశ, వయస్సులోనే వివాహం జరగడం వలన బాలల ఆరోగ్యం, విద్య అన్ని దెబ్బతింటాయన్నారు. చిన్న వయస్సులో వివాహం జరపొద్దని సూచించారు.