News March 21, 2025
వేములవాడలో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీచైతన్య పాఠశాలలో పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా విద్యార్థులు రాస్తున్న తీరును పరిశీలించి, పరీక్ష కేంద్రాల్లో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News November 26, 2025
KNR: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా ప్రతిజ్ఞ

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులు, సిబ్బంది చేత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశ రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు వుందని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, దేశ అభివృద్ధికి కట్టుబడి వుండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు.
News November 26, 2025
WGL: ఫంక్షన్కు తీసుకెళ్లలేదని.. వివాహిత ఆత్మహత్య

WGL జిల్లా సంగెం మండలం ఎల్గూరు రంగంపేటలో విషాదం చోటు చేసుకుంది. ఫంక్షన్కు తీసుకెళ్లలేదన్న మనస్తాపంతో గుగులోతు కవిత(28) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త సుకుమార్ పిల్లలతో కలిసి ఫంక్షన్కు వెళ్లడంతో ఆమె ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తలుపు తీయకపోవడంతో ఇంట్లో ఉరేసుకున్నట్లు గమనించారు. ఆమె మృతితో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 26, 2025
29న ఒంగోలులో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు

ఒంగోలులోని డీఆర్ఆర్ఎం హై స్కూల్లో ఈనెల 29న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల సందర్భంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులను క్రీడా పోటీలలో సైతం ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు పాల్గొనాలని కోరారు.


