News April 9, 2025
వేములవాడలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వేములవాడ పరిధిలోని బాలనగర్, వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి, మల్లారం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, తదితరులు ఉన్నారు.
Similar News
News November 21, 2025
ఎన్కౌంటర్లపై మావోయిస్టుల లేఖ

వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. మారేడుమిల్లి ఎన్కౌంటర్ పేరుతో కట్టుకథలు అల్లారని ఆరోపించింది. చికిత్స కోసం వచ్చిన <<18318593>>HIDMA<<>>ను ఎన్కౌంటర్ చేశారని మండిపడింది. నిరాయుధులుగా ఉన్నవారిని హత్య చేశారంది. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే హిడ్మాను పట్టుకున్నారని తెలిపింది. ఈనెల 23న దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలుపునిచ్చింది.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణకు నిధి అగర్వాల్

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. మ.3గం.కు హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ కార్యాలయానికి హాజరవుతున్నారు. ప్రమోషన్లకు సంబంధించిన వివరాలపై అధికారులు కీలకంగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. ప్రమోషన్లు చేసిన తర్వాత ఎంత పారితోష్కం తీసుకున్నారన్న అంశాలపై సీఐడీ విచారణ జరుపుతోంది.
News November 21, 2025
90 ఏళ్ల క్రితమే మన సినిమాల్లో కిస్ సీన్!

ఇండియన్ సినిమాలో ముద్దు సీన్లు ఇప్పుడు కామన్. కానీ 90 ఏళ్ల క్రితమే మన సినిమాల్లో ముద్దు సీన్ స్టార్ట్ చేశారనే విషయం మీకు తెలుసా? 1933లో వచ్చిన ‘కర్మ’ చిత్రంలో నటీనటులు దేవికా రాణి, హిమాన్షు రాయ్ (నిజ జీవితంలో భార్యాభర్తలు) సుదీర్ఘమైన తొలి ముద్దు సీన్లో నటించారు. దాదాపు 4 నిమిషాల పాటు సాగిన ఈ ముద్దు సన్నివేశం అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిందని సినీవర్గాలు చెబుతున్నాయి.


