News February 18, 2025

వేములవాడలో 3 రోజులు జాతర.. మీరు వెళుతున్నారా?

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ఈనెల 25 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 25న రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి వస్త్రాలంకరణ, కోడె మొక్కులు నిర్వహిస్తారు. 26న మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 27న స్వామివారి ఆర్జిత సేవలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Similar News

News January 8, 2026

అవకాడో సాగులో ఏ మొక్కలతో ఎక్కువ దిగబడి వస్తుంది?

image

అవకాడోలను సాధారణంగా విత్తనాల నుంచి ప్రవర్ధనం చేస్తారు. అయితే అధిక దిగుబడినిచ్చే మొక్కల నుంచి అంటుకట్టడం మరియు మొగ్గ తొడగడం అనే రెండు పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేసిన మొక్కల నుంచి అధిక దిగుబడులు వస్తాయి. విత్తనాలను నేరుగా మట్టిలో నాటవచ్చు లేదా రబ్బర్, ప్లాస్టిక్ సంచులలో నర్సరీ మిశ్రమంలో 2 నుంచి 3 గింజలను నాటాలి. తోటలలో నాటడానికి ముందు 2 నుంచి 3 నెలల వరకు గ్రీన్‌హౌస్‌లలో అవకాడో మొక్కలను పెంచడం మంచిది.

News January 8, 2026

విశాఖ: సంక్రాంతి తర్వాత.. మరో 3 రోజులు పండగే!

image

విశాఖ వేదికగా తారల క్రికెట్ పండగకు రంగం సిద్ధమైంది. ACA-VDCA స్టేడియంలో జనవరి 16, 17, 18 తేదీల్లో CCL 2026 మ్యాచ్‌లు జరగనున్నాయి. ముఖ్యంగా జనవరి 16న మధ్యాహ్నం 2 గంటలకు పంజాబ్ vs కర్ణాటక, సాయంత్రం 6:30కు మన తెలుగు వారియర్స్ vs భోజ్‌పురి దబాంగ్స్ తలపడతాయి. 17, 18 తేదీల్లో ముంబై, బెంగాల్, చెన్నై జట్లు ఆడే మ్యాచ్‌లతో ఈ వారాంతం విశాఖలో సందడి నెలకొననుంది.

News January 8, 2026

NZB: మున్సిపల్ రిజర్వేషన్లపై ఆశావాహుల ఉత్కంఠత

image

జిల్లాలోని NZB మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపాలిటీలలో రిజర్వేషన్లపై పోటీ చేసేందుకు సిద్ధమైన ఆశావహుల్లో ఉత్కంఠత నెలకొంది. చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేటర్ సీట్లు ఏ కేటగిరికి రిజర్వు అవుతాయోనని ఆశావహులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. దామాషా పద్ధతిలో మహిళలకు 50 శాతం సీట్లు రిజర్వు అవుతుండగా మిగిలిన స్థానాలు ఏ కేటగిరికి రిజర్వ్ అవుతుందోనని ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.