News February 18, 2025
వేములవాడలో 3 రోజులు జాతర.. మీరు వెళుతున్నారా?

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ఈనెల 25 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 25న రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి వస్త్రాలంకరణ, కోడె మొక్కులు నిర్వహిస్తారు. 26న మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 27న స్వామివారి ఆర్జిత సేవలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Similar News
News April 17, 2026
అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి భూప్రకంపనలు

అనకాపల్లి జిల్లా పరిధిలో గురువారం అర్ధరాత్రి భూప్రకంపనలు సంభవించాయి. సుమారు 12:31 గంటల సమయంలో 5 నుంచి 10 సెకండ్లపాటు భూమి కంపించినట్లు సమాచారం. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు సంభవించినట్లు సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. మీ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయా? కామెంట్ చేయండి.
News April 17, 2026
ఏడుపాయల హుండీ ఆదాయం రూ.52.12 లక్షలు

ఏడుపాయల వన దుర్గా భవాని దేవస్థానం హుండీలు లెక్కించగా రూ.52.12 లక్షలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మఠం వీరేశం, ఎండోమెంట్ మెదక్ జిల్లా ఇన్ స్పెక్టర్ రంగారావు తెలిపారు. మెదక్ ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 56 రోజుల హుండీ లెక్కించారు. మిశ్రమ బంగారం 0.024 గ్రాములు, మిశ్రమ వెండి 000.927 గ్రాములు వచ్చినట్లు చెప్పారు.
News April 17, 2026
కర్నూలు: 7 నిమిషాల్లో స్వామి సన్నిధికి.. అంతలోనే యాక్సిడెంట్!

మరో 7 నిమిషాల్లో రాఘవేంద్రస్వామి సన్నిధికి చేరుకునే లోపే జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. నిన్న తెల్లవారుజామున మంత్రాలయం(M) చిలకలడోణ వద్ద 22 మందితో వస్తున్న ట్రక్కు(బొలెరో) సిమెంట్ లారీని ఢీకొట్టిన ఘటనలో కర్ణాటక రాష్ట్రం చిక్‌మంగళూరు(D) తరికేరి తాలూకా ఉడెవా గ్రామానికి చెందిన ఇద్దరు, హాసన(D) బేలూరు తాలూకా శెట్టిగెరె గ్రామానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. వీరంతా సమీప బంధువులు.


