News February 18, 2025
వేములవాడలో 3 రోజులు జాతర.. మీరు వెళుతున్నారా?

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ఈనెల 25 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 25న రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి వస్త్రాలంకరణ, కోడె మొక్కులు నిర్వహిస్తారు. 26న మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 27న స్వామివారి ఆర్జిత సేవలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Similar News
News April 11, 2026
నేరరహిత గ్రామాలే లక్ష్యం కావాలి: ఎస్పీ శబరీశ్

తొర్రూరు మండలం చర్లపాలెంలో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను ఎస్పీ శబరీశ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాలు నేరరహితంగా మారేందుకు నూతన సర్పంచ్‌లు చొరవ చూపాలని కోరారు. సీసీ కెమెరాల నిఘా వల్ల భద్రత పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే, రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. సర్పంచ్ మహేందర్ పాల్గొన్నారు.
News April 11, 2026
ప్రకాశం: ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

ఒంగోలులో ఒపెన్ ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనానికి సర్వం సిద్ధమైంది. స్థానిక D.R.R.M మున్సిపల్ హైస్కూల్‌లో ఈనెల 11 నుంచి 15 వరకు స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ నిర్వహించనున్నట్లు DEO, క్యాంప్ ఆఫీసర్ P.V రేణుక తెలిపారు. అయితే త్వరలో వెలువడనున్న ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News April 11, 2026
NTR: వేడినీళ్ల కాలువలో పడి వ్యక్తి దుర్మరణం (ఫైల్ ఫొటో)

ఇబ్రహీంపట్నంలోని వేడినీళ్ల కాలువలో పడి శంకర్రావు (55) అనే ఆటో డ్రైవర్ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. కొత్త గేటు ప్రాంతానికి చెందిన ఆయన శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు కాలువలో పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


