News February 26, 2026

వేములవాడ: అనర్గళంగా ఇంగ్లీష్.. అవాక్కైన అధికారులు

image

రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరమా అగ్రవాల్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఏఎస్సీ చంద్రయ్య వేములవాడలోని భిక్షగాళ్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ పునరావాస చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జలంధర్రెడ్డి, శిరీష దంపతులు అనర్గళమైన ఇంగ్లిష్ వాగ్దాటిని చూసి అధికారులు అవాక్కయ్యారు. దీంతో ఆ దంపతుల జీవన శైలి వెలుగులోకి వచ్చింది. అధికారులు ఏమైనా ఉపాధి కల్పిస్తే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తామన్నారు.

Similar News

News April 14, 2026

పోలీసులు వీధి రౌడీల్లా ప్రవర్తించడమేంటి: జగన్

image

AP: SM కేసులలో పోలీసులు వీధి రౌడీల్లా అర్ధరాత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడమేంటని YCP చీఫ్ జగన్‌ మండిపడ్డారు. ‘TDP నేతల మెప్పుకోసం కొందరు పోలీసులు రెచ్చిపోతున్నారు. వారిపై హైకోర్టులో కేసులు వేసి బాధితులకు న్యాయం చేస్తాం’ అని పేర్కొన్నారు. వేమూరు, రేపల్లె YCP నేతలు ఇవాళ జగన్‌ను కలిశారు. GOVT, TDP తీరుపై SMలో విమర్శించినందుకు పోలీసులు కొట్టారని పార్టీ నేతలు తనీష్, కృష్ణార్జునరెడ్డి తెలిపారు.

News April 14, 2026

కడప జిల్లాలో బెల్ట్ షాపులపై 47 కేసులు

image

కడప జిల్లా వ్యాప్తంగా మద్యం బెల్ట్ షాపులపై విస్తృతస్థాయిలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఒకేరోజు 47 కేసులు నమోదు చేశారు. 47 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 579 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 554 క్వార్టర్ బాటిళ్ల మద్యం, 25 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశ్వనాథ్ హెచ్చరించారు.

News April 14, 2026

ADB: రేపు జిల్లాకు మంత్రి పొన్నం రాక

image

రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఈ నెల 15న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా బుధవారం ఆదిలాబాద్‌లో నిర్వహించే పలు కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు ఆర్టీవో అధికారులు మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు.