News February 12, 2026

వేములవాడ: ఎన్నికల ఫలితాలు లెక్కింపునకు 28 టేబుల్స్

image

వేములవాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల లెక్కింపు కోసం 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక వార్డు ఓట్లను ఒక్కో టేబుల్‌పై లెక్కిస్తారు. ఒక్కో రౌండ్‌లో వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. 1000కి మించిన ఓట్లను రెండవ రౌండ్లో లెక్కిస్తారు. మొత్తం 28 వార్డులకు గాను మూడు వార్డుల్లో వెయ్యికి తక్కువ ఓట్లు పోల్ కాగా, మిగతా 25 వార్డుల్లో వెయ్యికి పైగా ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో మూడు వార్డుల ఫలితాలు తొలి రౌండులోనే రానున్నాయి.

Similar News

News March 11, 2026

ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపండి: US

image

ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌ను అమెరికా కోరినట్లు US మీడియా సంస్థ Axios పేర్కొంది. ఇరాన్ ఆయిల్, ఎనర్జీ సదుపాయాలపై మరిన్ని దాడులు చేస్తే ఆ దేశ ప్రజలకు హాని కలగవచ్చని, ఆయిల్ ధరలు భారీగా పెరగొచ్చని US చెప్పినట్లు తెలిపింది. అలాగే గల్ఫ్ దేశాల ఎనర్జీ సదుపాయాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసే అవకాశమూ ఉందని, యుద్ధం తర్వాత ఆయిల్ సెక్టార్‌కు ఇరాన్ సహకారం అవసరమని US భావిస్తోందని వెల్లడించింది.

News March 11, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 11, 2026

కడప: రైతు కష్టం.. AMCలకు ఆదాయం పంట..!

image

రైతులు కష్టపడి పండించిన వ్యవసాయ ఉత్పత్తులపై కడప జిల్లా AMCలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవని నాటికి రూ.11.78 కోట్లు లభించింది. పంటల వారీగా AMCలకు లభించిన ఆదాయం రూ.లక్షల్లో ఇలా. వరి-194, బియ్యం-52, వేరుశనగ-43, ప్రొద్దుతిరుగుడు-3, పత్తి-117, ఉల్లి-17, పప్పుశనగ-86, కందులు-3, బత్తాయి-14,, పసుపు-99, మినుములు-98, నువ్వులు-,96, మొక్కజొన్న-62, జొన్న-16, పప్పుదినుసులు-12, అరటి-21, ఇతర పంటలు-239 లక్షలు.