News February 13, 2026
వేములవాడ కాంగ్రెస్ కౌన్సిలర్ల క్యాంపు ఫోటో విడుదల

వేములవాడ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన 13 మంది కౌన్సిలర్లు గెలుపొందగా, బీఆర్ఎస్ నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్రుల చేరికతో కాంగ్రెస్ బలం 16కు చేరింది. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకోవడం లాంఛనంగా మారిన నేపథ్యంలో హైదరాబాద్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి ఉన్న ఫోటోలను విడుదల చేశారు.
Similar News
News March 10, 2026
ఈ ఇద్దరు MPలు జీతాలు తీసుకోవట్లే!

ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా చాలామంది పార్లమెంటేరియన్లు జీతాలు వదులుకునేందుకు ఇష్టపడట్లేదు. ప్రస్తుతం 18వ లోక్‌సభలో మొత్తం 543 మందిలో కేవలం ఇద్దరే జీతభత్యాలు తీసుకోవట్లేదని RTI ద్వారా తెలిసింది. హరియాణా BJP MP నవీన్ జిందాల్ జీతంతో పాటు అన్ని అలవెన్సులను వదులుకోగా కాంగ్రెస్ MP అంగోమ్చా బిమోల్ అకోయిజామ్(మణిపుర్) తన వేతనాన్ని నిరాకరించారు. పదవి ప్రజాసేవకే తప్ప సంపాదనకు కాదు అని వీరు నిరూపించారు.
News March 10, 2026
పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

గిరిజన ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని నిరూపిస్తూ పాడేరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో అరుదైన థైరాయిడ్ క్యాన్సర్ శస్త్రచికిత్స విజయవంతమైంది. లింగపుట్టు గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతికి పాపిల్లరీ కార్సినోమా థైరాయిడ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యులు టోటల్ థైరాయిడెక్టమీతో పాటు మోడిఫైడ్ రాడికల్ నెక్ డిసెక్షన్ శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉంది.
News March 10, 2026
అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

అన్ని వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నకిరేకల్‌లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా ఈ ప్రణాళికను రూపొందించామని, దీని విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.


