News March 8, 2025

వేములవాడ: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి

image

వేములవాడ రూరల్ మండలం పాజిల్ నగర్ అటవీ ప్రాంతంలో చిరుతపుడి దాడిలో లేగ దుడ మృతి చెందింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. ఉప్పల నారాయణ అనే రైతు తన లేగ దూడ రోజు మాదిరిగానే పొలం వద్ద కొట్టంలో కట్టేశాడు. రాత్రివేళలో చిరుత పులి దాడి చేయడంతో దూడ మృతిచెందింది. పులి జాడ కోసం అటవీశాఖ అధికారులు అన్వేషిస్తున్నారు.

Similar News

News October 15, 2025

MDK: ‘రూల్స్ పాటించకపోతే చర్యలే’

image

ప్రతి దీపావళికి జిల్లాలో 250 వరకు టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తారు. మెదర్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ తదితర ఏరియాల్లో భారీగా వెలుస్తాయి. అయితే దుకాణాల నిర్వాహకులు ఇష్టానుసారంగా ఏర్పాట్లు చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో టపాసుల షాపులను నిబంధనల మేరకే ఏర్పాటు చేసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు.

News October 15, 2025

పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కృషి: కలెక్టర్ దినేశ్

image

అల్లూరి జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. విద్యాలయాల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. వాటితో ఇప్పటికే కొంతవరకు పనులు జరుగుతున్నాయన్నారు. ఆయా పనులను మరింత వేగవంతం చేస్తున్నామన్నారు. ప్రతి పాఠశాలలో చక్కని తరగతి గది, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, తదితర కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు.

News October 15, 2025

MBNR: రేపే స్నాతకోత్సవం.. 83 గోల్డ్ మెడల్స్ ప్రదానానికి సిద్ధం

image

పీయూలో 4వ స్నాతకోత్సవం ఈనెల 16న ఉదయం 10:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ స్నాతకోత్సవంలో..
✒83 బంగారు పతకాలు
✒12 పీహెచ్.డీలు. (కెమిస్ట్రీ-5, మైక్రోబయాలజీ-5, బిజినెస్ మానేజ్మెంట్-1, కామర్స్-1)
✒2,809 పీజీ, 8,291 ప్రొఫెషనల్ కోర్సులు, 18,666 యూజీ డిగ్రీలు ప్రదానం చేయనున్నారు.
✒PU సిబ్బందితో కూడిన 7 కమిటీలు ఏర్పాటు.
✒రెండో దశ NAAC అక్రిడిటేషన్ పూర్తి చేసుకుంది.