News May 22, 2024
వేములవాడ: తప్పిన పెను ప్రమాదం.. ఊడిపోయిన టిప్పర్ టైర్లు

వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రధాన చౌరస్తా మూలమలుపు వద్ద బుధవారం ఉదయం బండల లోడ్తో వెళ్తున్న టిప్పర్ వెనుక టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయి. ప్రమాద సమయంలో టిప్పర్ దగ్గర ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో కాసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
Similar News
News November 17, 2025
KNR: NTR వీరాభిమాని గుండెపోటుతో మృతి

రాజకీయాల్లో చంద్రబాబు నాయడు కంటే సీనియర్, NTR వీరాభిమాని కళ్యాడపు ఆగయ్య గుండెపోటుతో KNRలో మృతి చెందారు. TDP ఆవిర్భావం నుంచి ఆగయ్య పార్టీని వీడకుండా పనిచేస్తూ ఎన్టీఆర్ వీరాభిమానిగా గుర్తింపు పొందారు. పేరు పెట్టి పిలిచేంతగా, ఎన్టీఆర్ కుటుంబంలో తెలిసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సేవలను గుర్తించి మహానాడు కార్యక్రమంలో ఆగయ్యను సన్మానించారు కూడా.
News November 17, 2025
WJI జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుడాల శ్రీనివాస్

వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా(WJI) జిల్లా ప్రధాన కార్యదర్శిగా గన్నేరువరం మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, రిపోర్టర్ గుడాల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కమిటీ సూచనల మేరకు ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, జర్నలిస్టుల సంక్షేమం, సంఘం బలోపేతం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.
News November 17, 2025
జమ్మికుంటలో పత్తి కొనుగోళ్లు బంద్

CCI L- 1, L- 2 విధానాలు, స్లాట్ బుకింగ్ వల్ల రైతులు, జిన్నింగ్ మిల్లులు ఇబ్బందులు పడుతున్నాయని జమ్మికుంట మార్కెట్ కమిటీ తెలిపింది. వినతులు ఇచ్చినా చర్యలు లేకపోవడంతో జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ పిలుపుమేరకు నేటి నుంచి జమ్మికుంటలో CCI, ప్రైవేట్ కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రైతులు పత్తిని మార్కెట్ యార్డు, మిల్లులకు తీసుకురావద్దని, ‘కపాస్ కిసాన్’లో స్లాట్ బుక్ చేయవద్దని సూచించారు.


