News February 3, 2025
వేములవాడ: నేడు అఘోరి వస్తుందా..? రాదా..?

గతంలో అఘోరి చేసిన వ్యాఖ్యలతో నేడు ఏం జరగనుందో అని అంతటా చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లేడీ అఘోరి ఫిబ్రవరి 3న వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చి ఆలయంలోని దర్గాను కూల్చివేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి వేములవాడ వైపు మళ్లింది. అఘోరి చెప్పినట్లుగా నేడు నిజంగా ఆమె వేములవాడకు వస్తుందా..? రాదా..? అనేది మరికొద్దిసేపట్లో తెలవనుంది.
Similar News
News February 9, 2026
NLG: ఆ ఇద్దరు అమాత్యులకు పరీక్షే..!

మున్సిపల్ ఎన్నికల సమరానికి మరో ఒక్కరోజే మిగిలి ఉండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. ముఖ్యంగా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ సొంత నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అధికారాన్ని దక్కించుకోవడం, రాజకీయ పట్టు నిలబెట్టుకోవడం లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
News February 9, 2026
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు.. నేడు పట్టువస్త్రాల సమర్పణ

AP: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ రెండోరోజు సాయంత్రం ద్వారకా తిరుమల ఆలయం తరఫున పట్టువస్త్రాలను పండితులు సమర్పిస్తారు. రాత్రి స్వామి అమ్మవార్లకు భృంగి వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 13 నుంచి 16 వరకు భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందజేస్తారు. ఈ నెల 18 వరకు కొనసాగే బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు.
News February 9, 2026
ఉమ్మడి ఖమ్మంలో ఆమెదే పైచేయి

ఉమ్మడి ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు తమ ఆధిపత్యాన్ని చాటుతున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ సహా 7మున్సిపాలిటీల్లో మొత్తం 1,93,833 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,01,164 మంది మహిళలే కావడం విశేషం. బరిలో ఉన్న 953 మంది అభ్యర్థుల్లో 473మంది మహిళలే కాగా.. ఏడు ఛైర్మన్ పీఠాల్లో ఆరు మహిళలకే రిజర్వు అయ్యాయి. ఓటు వేసే వారిలోనూ, పోటీలోనూ ఆమెదే పైచేయి కావడంతో అభ్యర్థుల గెలుపోటములను మహిళా ఓటర్లే శాసించనున్నారు.


