News February 2, 2025
వేములవాడ: పులి పుకార్లను నమ్మవద్దు: డీఎఫ్వో

పులి దొరికిందన్న పుకార్లను నమ్మవద్దని జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి అన్నారు. మండలంలో పులి సంచారం ఉందన్న సమాచారం మేరకు నూకలమర్రి గ్రామ శివారులో పలు ప్రాంతాలను సిబ్బందితో కలిసి ఆమె శనివారం పరిశీలించారు. అనంతరం వేములవాడలోని అటవీశాఖ కార్యాలయంలో డీఎఫ్వో మాట్లాడుతూ.. పులి సంచారంపై గ్రామాల ప్రజలందరూ ఆందోళన చెందవద్దన్నారు. పొలాలకు వెళ్లే రైతులు అటవీశాఖ అధికారులు సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
Similar News
News September 14, 2025
జూరాల ప్రాజెక్టుకు 9 గేట్లు ఎత్తివేత

ధరూరు మండలంలోని జూరాల ప్రాజెక్టుకు కర్ణాటక నుంచి వరద కొనసాగుతుంది. ఆదివారం ఉదయం ప్రాజెక్టుకు 1 లక్ష క్యూసెక్కులు వస్తుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు 9 స్పిల్ వే గేట్లు ఓపెన్ చేసి 62,406 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తికి 38,271, ఎడమ కాలువకు 550 క్యూసెక్కులు మొత్తం 1,01,272 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది.
News September 14, 2025
రేపు విశాఖ ప్రభుత్వ కార్యాలయాలలో పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమీషనర్ కేతాన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. కలెక్టర్ కార్యాలయంలో, సీపీ, జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
News September 14, 2025
త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం

లక్నో విమానాశ్రయంలో లక్నో- ఢిల్లీ ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎంపీ డింపుల్ యాదవ్తో పాటు 151 మంది ప్రయాణికులు ఉన్న విమానం టేకాఫ్ సమయంలో రన్వే మీద ఒక్కసారిగా స్లో అయింది. పైలట్ చాకచక్యంగా ఎమర్జెన్సీ బ్రేకులను ఉపయోగించి ఫ్లైట్ను రన్వే దాటకుండా ఆపారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.