News February 13, 2026

వేములవాడ: బీజేపీ కౌన్సిలర్ల క్యాంపు బాట.. చైర్మన్ స్థానంపై గురి

image

వేములవాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో 8 వార్డులు గెలుచుకుని రెండవ పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ చైర్మన్ గిరీపై కన్నేసింది. బీఆర్ఎస్‌కు ఐదు స్థానాలు రావడంతో.. ఒకరిద్దరు స్వతంత్రుల మద్దతుతో చైర్మన్ స్థానం దక్కించుకోవాలని ఆ పార్టీ ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు తమ వద్ద ఉన్న కౌన్సిలర్లను కాపాడుకునేందుకు క్యాంపునకు బయలుదేరారు. బీఆర్ఎస్ సభ్యులతో పాటు, స్వతంత్రులతో బీజేపీ నాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది.

Similar News

News March 13, 2026

అనకాపల్లి: మృతి చెందిన యువకుడి వివరాలు ఇవే..

image

మాకవరపాలెం మండలం <<19373124>>దాలింపేట<<>> వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్.రాయవరం మండలం దార్లపూడి గ్రామానికి చెందిన జవ్వాది దిలీప్ కుమార్(19) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మండలంలోని జీ.కోడూరులో ఉన్న తన అక్క ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని ఎస్ఐ దామోదర్ నాయుడు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు. కాగా ఈ ప్రమాదంలో బైక్ నుజ్జునుజ్జు అయింది.

News March 13, 2026

జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కామారెడ్డి కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో గ్యాస్ కొరత లేదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయిల్ కంపెనీ ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్యాస్ లభ్యతపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, స్టాక్ పరిస్థితిని ప్రతిరోజూ సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరఫరాను సమన్వయం చేసుకోవాలని సూచించారు.

News March 13, 2026

BREAKING: అకౌంట్లలో డబ్బులు జమ

image

AP: ఉగాది కానుకగా PM కిసాన్‌తోపాటు అన్నదాత సుఖీభవ నిధులను CM చంద్రబాబు విడుదల చేశారు. కృష్ణా(D) గన్నవరంలో 46.85 లక్షల మంది అన్నదాతల అకౌంట్లలో రూ.6 వేల చొప్పున జమ చేశారు. వీటిలో పీఎం కిసాన్ నిధులు రూ.2వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.4వేలున్నాయి. మీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయో లేదో ఇక్కడ <>క్లిక్<<>> చేసి, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి తెలుసుకోండి.