News February 26, 2026
వేములవాడ: మార్చి 6న శివ కల్యాణోత్సవం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో మార్చి 6వ తేదీన పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల భాగంగా రెండవ రోజు పార్వతి రాజరాజేశ్వర స్వామివారి కల్యాణం నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. 1వ తేదీ ఆదివారం సాయంత్రం కామదహహనం, 3 రోజులు డోలోత్సవం అంతర్గతంగా నిర్వహిస్తామని వెల్లడించారు.
Similar News
News April 12, 2026
పాల్వంచ: విధి వక్రీకరించినా.. పరీక్షలో గెలిచాడు

విధి ఆ యువకుడి ప్రాణాన్ని హరించినా.. అతడు రాసిన రాత మాత్రం గెలిచింది. కరకవాగు 34వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి కుమారుడు భట్టు అఖిల్ నందన్ ఈ నెల 5న జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందాడు. ఆదివారం విడుదలైన ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అఖిల్ ఉత్తీర్ణుడైనట్లు చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఫలితం వచ్చే సమయానికి కొడుకు ప్రాణాలతో లేకపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News April 12, 2026
దేశాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు

*అమెరికా- 56.7 డిగ్రీలు (1913)
*ట్యునీషియా- 55 (1931)
*కువైట్- 54 (2016)
*ఇరాన్- 54 (2017)
*ఇజ్రాయెల్- 54 (1942)
*ఇరాక్- 53.9 (2016)
*పాకిస్థాన్- 53.7 (2017)
*యూఏఈ- 52.1 (2002)
*భారత్- 50.6 (2016)
News April 12, 2026
NZB: మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మక ఘట్టం: MP

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మక ఘట్టమని, 2029 ఎన్నికల నాటికి వాటిని అమలు చేయబోతున్నామని NZB MP ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ఆదివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా మహిళలకు రిజర్వేషన్లపై చట్టం చేయబోతున్నారని అన్నారు. మహిళల 30 ఏళ్ల నిరీక్షణకు ప్రధాని మోదీ తెరదించారని, వారికి ఇంతకంటే పెద్ద పండుగ ఉండదని పేర్కొన్నారు.


