News February 26, 2026

వేములవాడ: మార్చి 6న శివ కళ్యాణ మహోత్సవం

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో మార్చి 6వ తేదీన పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల భాగంగా రెండవ రోజు పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. 1వ తేదీ ఆదివారం సాయంత్రం కామదహహనం, 3 రోజులు డోలోత్సవం అంతర్గతంగా నిర్వహిస్తామని వెల్లడించారు.

Similar News

News April 14, 2026

కడప: స్పోర్ట్స్ కోటా టీచర్లకు తిరుపతిలో రేపు సమావేశం

image

మెగా డీఎస్సీ 2025లో స్పోర్ట్స్ కోట ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల 15న తిరుపతిలో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ మంగళవారం తెలిపారు. కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు డీఎస్డీవో/డీఎస్ఏ కార్యాలయం, తిరుపతిలో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. విద్యాశాఖ మంత్రి ప్రత్యేక సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు.

News April 14, 2026

శుభవార్త.. పోలీసులకు ప్రత్యేక సెలవులు

image

AP: నిత్యం విధుల్లో ఉండే పోలీసులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బర్త్ డే, మ్యారేజ్ డే సందర్భంగా వారు కుటుంబంతో గడిపేందుకు వీలుగా స్పెషల్ లీవ్స్ కల్పిస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులిచ్చారు. అన్ని ర్యాంకుల సిబ్బందికి ఈ సెలవులు మంజూరు చేయాలని జిల్లాల ఎస్పీలు, అన్ని పోలీస్ విభాగాల అధిపతులను ఆదేశించారు. దీంతో వేలాది పోలీసులకు ఊరట కలగనుంది.

News April 14, 2026

సిరిసిల్ల : రేషన్ కార్డుల్లో అనర్హుల ఏరివేత..!

image

రేషన్ కార్డుల్లో అనుమానితులను ఏరీవేసే ప్రక్రియను ప్రభుత్వం మరోసారి చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనరేట్ నుంచి రెండో విడతగా జిల్లాలో అనర్హులను గుర్తించి అనుమానిత జాబితాను పంపించింది. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన మొదలుపెట్టారు. జిల్లాలో 6582 అనుమానిత రేషన్ కార్డు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగం, రూ8.లక్షలు ఆదాయం మించి ఉంటే రేషన్ కార్డ్ కట్ చేస్తున్నారు.