News August 31, 2024

వేములవాడ: రంగు మారుతున్న ధర్మగుండం నీళ్లు!

image

శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం వేలాది మంది భక్తులతో రాజన్న ఆలయం రద్దీగా మారింది. అయితే దర్శనానికి వచ్చిన భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేయడంతో నీళ్లు మురికిగా మారాయి. నీరు పచ్చబడినట్లు భక్తులకు కనిపించడంతో స్నానాలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆలయ అధికారులు స్పందించి పచ్చబడ్డ నీళ్లు తొలగించాలని కోరుతున్నారు.

Similar News

News September 9, 2024

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి

image

జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆదివారం రవీంద్రభారతిలో జరిగింది. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ.. జర్నలిస్ట్‌ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న జర్నలిస్ట్ కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

News September 8, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు

image

ఓదెల: మాజీ సర్పంచ్ సాగు చేస్తున్న సీలింగ్ భూమిపై ఫిర్యాదు. సిరిసిల్ల: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత! కరీంనగర్: లోయర్ మానేరు డ్యాములో 20.66 టీఎంసీల నీరు నిల్వ. పెద్దపల్లి: బార్డర్ లో రామగుండం యువ జవాన్ అనుమానాస్పద మృతి?. పెద్దపల్లి: అక్రమాలపై యంత్రాంగం ఉక్కు పాదం. రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల సందడి. జగిత్యాల: గణనాథుల వద్ద రెండవ రోజు కొనసాగుతున్న భక్తుల కోలాహలం.

News September 8, 2024

KNR: టీచర్లు తలుచుకుంటే సర్కార్ తలరాతలే మారతాయి: కేంద్రమంత్రి

image

టీచర్లు తలుచుకుంటే సర్కార్ తలరాతలు మారతాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో ‘గురు వందనం’ కార్యక్రమంలో పాల్గొని పలువురు ఉత్తమ టీచర్లను సన్మానించారు. కాంగ్రెస్ ఉన్నంత కాలం మీ సమస్యలు తీరవు అన్నారు. 317 జీవోతో టీచర్లు అల్లాడితే ఉపాధ్యాయలు ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. టీచర్ల పక్షాన కొట్లాడి జైలుకు వెళ్లిన ఏకైక సంఘం (TUPS) మాత్రమే అని తెలిపారు.