News February 27, 2025

వేములవాడ రాజన్నను దర్శించుకున్న ఎస్పీ అఖిల్ మహాజన్

image

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఎస్పీ అఖిల్ మహాజన్ దంపతులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి కోడి మొక్కలు చెల్లించుకున్నారు. శివరాత్రి రోజు దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

Similar News

News November 28, 2025

21 మందిని అరెస్టు చేసిన సైబర్ పోలీసులు

image

వివిధ ప్రాంతాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. వీరిలో 13 ట్రేడింగ్ ఫ్రాడ్స్, మిగతా వారిని డిజిటల్ అరెస్ట్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు వీరిని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా దాదాపు 49 కేసుల్లో బాధితులకు రూ.89.7 లక్షలను తిరిగి ఇప్పించారు.

News November 28, 2025

7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. BIG UPDATE

image

ఢిల్లీ పోలీస్ పరీక్షల(2025) తేదీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. మొత్తం 7,565 పోస్టులు ఉన్నాయి.
*కానిస్టేబుల్ (డ్రైవర్)- డిసెంబర్ 16, 17
*కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్)- డిసెంబర్ 18 నుంచి జనవరి 6
*హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్)- జనవరి 7 నుంచి 12
*హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్‌లెస్ ఆపరేటర్, TPO)- జనవరి 15 నుంచి 22.
> పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News November 28, 2025

రేపు విశాఖ రానున్న పవన్ కళ్యాణ్

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్వహించే నేవీ డే ముందస్తు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. శనివారం సాయంత్రం సముద్రికలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. డిసెంబర్ 4న నేవీ డేకి సంబంధించి ముందస్తు కార్యక్రమాలు విశాఖలో చేపట్టారు. పవన్ కళ్యాణ్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి షీలా నగర్.. మారుతీ జంక్షన్ మీదుగా ఈస్టర్న్ నావల్ కమాండ్‌కు చేరుకుంటారు.