News March 23, 2025
వేములవాడ: రాజన్న ఆలయంలో ఈనెల 30 నుంచి శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు

రాజన్న సన్నిధిలో ఈనెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకు శ్రీరామ నవరాత్రోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈఓ వినోదొడ్డి తెలిపారు. 30న ఉగాది సందర్భంగా ఉదయం 9 గంటలకు ప్రత్యేకపూజలు, సాయంత్రం 4.30కు పంచాంగ శ్రవణం, పండిత సత్కారం ఉంటుందన్నారు. రాత్రి 8 గంటలకు స్వామివారిని పెద్దసేవపై ఊరేగిస్తారని తెలిపారు. ఏప్రిల్ 6న సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవం ఉంటుందన్నారు.
Similar News
News September 17, 2025
రాష్ట్రవ్యాప్తంగా IT అధికారుల సోదాలు

TG: హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో IT అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ బంగారు దుకాణాల యజమానులే లక్ష్యంగా వారి ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. బంగారం లావాదేవీలు, ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలపై సోదాలు చేస్తున్నట్లు సమాచారం. వరంగల్లోనూ తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
News September 17, 2025
చంద్రగిరి కోటలో కూలిన కోనేరు ప్రహరీ

భారీ వర్షానికి చంద్రగిరి కోటలోని పురాతన కోనేరు ప్రహరీ కూలింది. గతంలో ఈ కోనేరులో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో బోటింగ్ నిర్వహిస్తుండేవారు. తర్వాత బోటింగ్ నిలిపివేశారు. ఆర్కియాలజీ అధికారి బాలకృష్ణారెడ్డి కోనేరు గోడను పరిశీలించారు. అధికారులకు దీనిపై నివేదిక పంపనున్నట్లు తెలిపారు. వర్షం ఎక్కువగా పడటంతోనే కోనేరు గోడ కూలిందని పురావస్తు శాఖ అధికారులు నిర్ధారించారు.
News September 17, 2025
చిత్తూరు: ప్రియురాలి ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య

చిత్తూరులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తవణంపల్లె మండలం దిగువమారేడుపల్లికి చెందిన దేవరాజులు(40) భార్య, పిల్లలను వదిలేసి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. 9ఏళ్లుగా గంగన్నపల్లికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఏమైందో ఏమో మంగళవారం సాయంత్రం ఆమె ఇంట్లోనే అతను ఉరేసుకున్నాడు. మొదటి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ నెట్టికంటయ్య తెలిపారు.