News February 24, 2025
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారిని సోమవారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. దీంతో ఆలయం భక్తులతో కోలాహలంగా మారి దర్శనమిస్తుంది. దర్శనంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి జాతరకు ముందు వచ్చే సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నట్లు తెలుస్తుంది.
Similar News
News December 2, 2025
‘మంత్రులు తుమ్మల, భట్టి, పొంగులేటి చొరవ తీసుకోవాలి’

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి భద్రాద్రి జిల్లా పర్యటన నేపథ్యంలో ఖమ్మం యూనివర్సిటీ కల సాకారమవుతుందని స్థానికులు, విద్యార్థులు ఆశిస్తున్నారు. 45 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను పరిష్కరించి, అన్ని వనరులు ఉన్న ఎస్ఆర్ & బీజీఎన్ఆర్ కళాశాలను యూనివర్సిటీగా ప్రకటిస్తారని ఆశపడుతున్నారు. ఈ విషయంలో మంత్రులు తుమ్మల, భట్టి, పొంగులేటి చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News December 2, 2025
MDK: పల్లెపోరు..బరిలో నిలిచేదెవరో.. తప్పుకునేదెవరో..?

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికల ‘పంచాయతీ’ వేడెక్కింది. దాదాపు 2ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బరిలో నిలిచేందుకు ఆశావహులు భారీగా పోటీ పడుతున్నారు. కొన్నిచోట్ల ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేయడం నేతలకు తలనొప్పిగా మారింది. ఓట్లు చీలకుండా ఒక్కరినే బరిలో దించేందుకు, నామినేషన్ల ఉపసంహరణకు నాయకులు బుజ్జగిస్తున్నారు. రేపటితో తొలివిడత బరిలో నిలిచేదెవరో.. తప్పుకునేదెవరో తేలనుంది.
News December 2, 2025
‘నువ్వు నాకేం ఇస్తావ్.. నేను నీకేం ఇవ్వాలి’

1ST ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు రేపటితో లాస్ట్. 398 GPలకు ఎన్నికలు జరుగుతుండగా 43 పంచాయతీలకు 3లోపే నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. దీంతో ఆ గ్రామపెద్దలు ఏకగ్రీవానికి ప్రయత్నిస్తున్నారు. ఏకగ్రీమైతే ప్రభుత్వం ఇచ్చే నజరానాతోపాటు ఎన్నికలకయ్యే ఖర్చు తగ్గుతుందంటూ సర్పంచ్ అభ్యర్థులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అభ్యర్థులు లక్షల్లో డిమాండ్ చేస్తూ వేలంపాటలకు సై అంటున్నారు.


