News February 6, 2025

వేములవాడ: రాజన్న సేవలో జబర్దస్త్ నటులు

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని గురువారం జబర్దస్త్ నటులు సుడిగాలి సుదీర్, ఆటో రామ్ ప్రసాద్‌లు దర్శించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, అందరూ బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు.

Similar News

News February 8, 2026

GWL: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక పర్యవేక్షణ

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో 77 వార్డులు ఉండగా 189 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు SP శ్రీనివాసరావు తెలిపారు. 105 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి వాటిపై ఎలక్షన్ సెల్ ద్వారా క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేస్తామన్నారు. బందోబస్తు నిర్వహణ మొదలుకొని ఎన్నికల సామగ్రికి భద్రత కల్పించే వరకు ప్రతి అంశాన్ని ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షణ చేస్తామన్నారు.

News February 8, 2026

MBNR: రేపటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

image

మహబూబ్‌నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎస్పీ డి.జానకి స్పందిస్తూ.. ప్రచార సమయం ముగిసిన వెంటనే బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, కార్యకర్తలు జిల్లా విడిచి వెళ్లాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 8, 2026

NLG: ఓట్ల లెక్కింపునకు వేదిక ఖరారు.. 3 రోజులు సెలవు!

image

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం నిడమనూరులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను కౌంటింగ్ కేంద్రంగా అధికారులు ఎంపిక చేశారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఈ పాఠశాలకు ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు స్థానిక సెలవులను ప్రకటించారు. లెక్కింపు ప్రక్రియకు ఆటంకం కలగకుండా ప్రిన్సిపాల్ తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.