News January 31, 2025
వేములవాడ: ‘విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించాలి’

విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్ పై జిల్లాలోని టీచర్లకు వేములవాడలోని ఉన్నత పాఠశాలలో 2 రోజుల శిక్షణ ఇచ్చారు. దీనికి హాజరైన సైకాలజిస్ట్ పున్నంచందర్, విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించే మెలకువలు తెలిపారు. టీనేజ్ లో విద్యార్థులు ఎదుర్కొనే శారీరక, మానసిక, నైతిక సమస్యల పట్ల అవగాహన కల్పించి భవిష్యత్ కోసం సరైన మార్గదర్శకం చేయాలన్నారు. ఒత్తిడి లేని, విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు.
Similar News
News December 6, 2025
ఇండిగో సంక్షోభం: CJI జోక్యం చేసుకోవాలని పిల్

ఇండిగో సంక్షోభంపై CJI జోక్యం చేసుకోవాలని కోరుతూ పిల్ దాఖలైంది. విమానయాన శాఖ, DGCA నుంచి స్టేటస్ రిపోర్టు తీసుకోవాలని, తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో అత్యవసర విచారణ కోసం పిటిషనర్ న్యాయవాదిని తన నివాసానికి పిలిపించి CJI మాట్లాడనున్నారని సమాచారం. మరోవైపు ఇండిగో సర్వీసులపై సమాచారం తెలుసుకుని రావాలని ప్రయాణికులను బెంగళూరు ఎయిర్పోర్టు కోరింది.
News December 6, 2025
రంగారెడ్డి: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రంగారెడ్డి జిల్లాలో శుక్రవారంతో ముగిసింది. చివరి విడతలో స్వీకరించిన నామినేషన్లను నేడు పరిశీలించనున్నారు. ఈనెల 9వ తేదీ వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. మూడో విడతలో 174 గ్రామపంచాయతీలకు, 1598 వార్డులకు అధికారులు నామినేషన్లను స్వీకరించారు. కాగా, జిల్లావ్యాప్తంగా 526 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
News December 6, 2025
NTR: పొందుగలలో బాలుడికి స్క్రబ్ టైఫస్ జ్వరం

మైలవరం మండలం పొందుగలకు చెందిన రాకేశ్ అనే బాలుడు జ్వరంతో బాధపడుతుండగా, కుటుంబ సభ్యులు అతడిని విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉన్న బాలుడికి పరీక్షలు చేయగా, స్క్రబ్ టైఫస్ జ్వరమని నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని చంద్రాల పీహెచ్సీ డాక్టర్ ప్రియాంక తెలిపారు.


