News January 29, 2025
వేములవాడ: శివలింగాన్ని అపహరించిన గుర్తుతెలియని వ్యక్తులు

వేములవాడ అర్బన్ మండలం అనుపురం ఆర్ఎన్ఆర్ కాలనీలో ప్రతిష్ఠించిన శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. మాఘ అమావాస్య నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేద్దామని గ్రామస్థులు వెళ్లగా.. అక్కడి శివలింగాన్ని అపహరణకు గురైనట్లు గుర్తించారు. దీంతో వారు నిశ్చేష్ఠులయ్యారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
Similar News
News November 11, 2025
చక్కటి కురులకు చక్కెర స్నానం

చక్కెరను వంటకాల్లో ఎక్కువగా వాడతారు. మరికొందరు చర్మ సౌందర్యం కోసం స్కిన్పై కూడా అప్లై చేస్తారు. అయితే, చక్కెర జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
షాంపూలో టీ స్పూన్ పంచదార వేసి ఈ మిశ్రమంతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చక్కెరతో తలస్నానం చేయడం వల్ల తలలో పేరుకుపోయిన మురికి పోతుంది. అలాగే జుట్టురాలడం, చుండ్రు, జుట్టు చిట్లడం, తలలో దురద వంటి సమస్యలు తగ్గుతాయి.
News November 11, 2025
TTDకి 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా

తిరుమలకు రూ.251.53 కోట్ల విలువైన 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని 2022-24 మధ్య భోలేబాబా డెయిరీ సరఫరా చేసినట్టు A16 అజయ్ కుమార్ సుగంధ్ రిమాండ్ రిపోర్ట్లో CBI SIT పొందుపరిచింది. ఇందులో రూ.137.22 కోట్ల విలువైన 37.38 లక్షల కిలోల కల్తీ నెయ్యిని శ్రీవైష్ణవి డెయిరీ ద్వారా తరలించారని సిట్ పేర్కొంది.
News November 11, 2025
తుళ్లూరు: కారుణ్య మరణం పిటిషన్పై హైకోర్టు సీరియస్

తమ భూమిని తిరిగి అప్పగించకలేకపోతే కారుణ్య మరణానికి అనుమతించాలని తుళ్ళూరు(M) రాయపూడికి చెందిన నెల్లూరి శేషగిరమ్మ, ఆమె కుమార్తె, మనవరాలు పిటిషన్ వేయడంపై హైకోర్టు సీరియస్ అయింది. ఆ తరహా అభ్యర్థనలు అనుమతించబోమని తెలుసు కదా అంటూ పిటిషనర్ తరపు న్యాయవాదిపై ఆగ్రహించింది. ప్రచారం కోసం కోర్టులను ఉపయోగించుకోవద్దంది. కాగా CRDAకు అప్పగించిన తమ 5 సెంట్ల భూమిని అప్పగించాలని వారు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు.


