News April 27, 2024
వేములూరి ప్రాజెక్టులో పడి వ్యక్తి మృతి

మండల పరిధిలోని యాతవాకిళ్ళ వేములూరి ప్రాజెక్టులో భీల్యానాయక్ తండాకు చెందిన బానోతు సైదా నాయక్ (41) ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సైదానాయక్ కొన్ని రోజులుగా మతిస్తిమితం సరిగా లేక ఊళ్లు తిరుగుతున్నాడన్నారు. శనివారం ప్రాజెక్టు వద్దకు వెళ్లిన మత్స్యకారులు సైదాను గుర్తించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Similar News
News November 27, 2025
నల్గొండ: ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ జిల్లాలో ఎస్సీ (SC) వర్గానికి చెందిన విద్యార్థులు ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని SCDD డిప్యూటీ డైరెక్టర్ శశికళ తెలిపారు. 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 9, 10వ తరగతి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు.
News November 27, 2025
NLG: మాజీ సైనికుల పిల్లలకు గుడ్ న్యూస్

మాజీ సైనికులు, అమరులైన సైనికుల పిల్లలు వృత్తి విద్యా కోర్సులు చదువుతుంటే వారికి కేంద్ర రక్షణ శాఖ ఉపకార వేతనాలు అందిస్తోందని నల్లగొండ రీజియన్ ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి తెలిపారు. అర్హులైన సైనిక కుటుంబాలకు చెందిన వారు డిసెంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు www.krb.gov.in ను గానీ, లేదా జిల్లా సైనిక సంక్షేమ అధికారిని, ఫోన్ 08682-224820 నంబర్ కు సంప్రదించాలని కోరారు.
News November 27, 2025
NLG: రెండు డివిజన్లు.. 117 క్లస్టర్లు!

నల్లగొండ, చండూరు డివిజన్లో పరిధిలో 14 మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు 117 క్లస్టర్లను గుర్తించారు. ప్రతి మూడు నాలుగు గ్రామాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. వారి గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీ చేయాలనుకునే వారు ఆ క్లస్టర్లోనే నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. క్లస్టర్లో రిటర్నింగ్ ఆఫీసర్ తోపాటు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు.


