News January 30, 2025
వేముల: నేత్రదానంతో ఇద్దరు అంధులకు చూపు

నేత్రదానం చేయడం వల్ల ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించవచ్చునని నేత్ర సేకరణ కేంద్ర అధ్యక్షుడు రాజు పేర్కొన్నారు. గురువారం వేముల మండలం కొత్తపల్లికి చెందిన చందా మల్లమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించడంతో రాజు మృతురాలి ఇంటికి వెళ్లి కార్నియాలను సేకరించి హైదరాబాదులోని డాక్టర్ అగర్వాల్ నేత్రనిధికి పంపించారు.
Similar News
News February 14, 2025
అర్జీల పరిష్కారానికి జవాబుదారిగా పనిచేయాలి: కలెక్టర్

రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీల పరిష్కారానికి పూర్తి బాధ్యతాయుతంగా, జవాబుదారితనంతో పనిచేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో బద్వేల్, కడప రెవెన్యూ డివిజన్ల పరిధిలోని రెవెన్యూ అధికారులకు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. రెవెన్యూ అంశాలకు సంబంధించిన చట్టాలపై సిబ్బందికి అవగాహన కల్పించినట్లు తెలిపారు.
News February 14, 2025
పోలీసులకు కడప ఎస్పీ సూచనలు

పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంపొందేలా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ అధికారులకు సూచించారు. శుక్రవారం కడపలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న కేసులపై నిశితంగా సమీక్ష జరిపి పోలీస అధికారులకు పలు సూచనలు చేశారు.
News February 14, 2025
సంజీవయ్య భారత దేశానికే ఆదర్శం: కలెక్టర్

దామోదరం సంజీవయ్య యావత్ భారత దేశానికే ఆదర్శం అని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం కడప కలెక్టరేట్‌లో దామోదరం సంజీవయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన నిస్వార్థ, నిరడంబర నేత దామోదరం సంజీవయ్య అని కొనియాడారు.