News February 20, 2025
వేముల: మహిళ హత్య కేసులో ముద్దాయి అరెస్ట్

వేముల మండలం కేకే కొట్టాల గ్రామ సమీపంలో ఈనెల 2వ తేదీన సింగంశెట్టి పద్మావతి అనే మహిళ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి ముద్దాయిని అరెస్టు చేసినట్లు సీఐ ఉసలయ్య, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ముద్దాయితోపాటు బంగారు గొలుసు, చెవి కమ్మలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచామన్నారు. బంగారం నగల కోసమే హత్య చేశారన్నారు.
Similar News
News December 4, 2025
ముద్దనూరు: వైసీపీ ఎన్నారై విభాగం ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్

వైసీపీ ఎన్నారై విభాగం ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ చింత ప్రదీప్ ఎంపికయ్యారు. ఈయన ముద్దనూరు మండల పరిధిలోని రాజు గురువాయిపల్లికి చెందిన వ్యక్తి. బుధవారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రదీప్ను నియమించినట్లు తెలిపారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తానని ప్రదీప్ పేర్కొన్నారు.
News December 3, 2025
కడప: రైలులో లైంగిక దాడి.. నిందితుడికి జీవిత ఖైదు

రైలులో చిన్నారిపై లైంగిక దాడి కేసులో బుధవారం కడప పోక్సో కోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. నిందితుడు రామ్ ప్రసాద్ రెడ్డికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. బాధితురాలికి రూ.10.50 లక్షల పరిహారం చెల్లించాలని గుంతకల్ డీఆర్ఎంను ఆదేశించారు. విధుల్లో ఉన్న టీటీఐలపై చర్యలకు సిఫార్సు చేశారు. శిక్ష పడేలా కృషి చేసిన రైల్వే హెడ్ కానిస్టేబుల్ నాగరాజును, పీపీలను ప్రశంసించారు.
News December 3, 2025
శనగ పంటలో పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి: JDA

శనగ పంటలో పచ్చ పురుగు నివారణకు పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి(JDA) చంద్ర నాయక్ రైతులకు సూచించారు. ప్రొద్దుటూరు మండలంలో సాగుచేసిన పప్పు శనగ పంటను బుధవారం ఆయన పరిశీలించారు. పచ్చ పురుగులను పక్షులు ఏరుకొని తింటాయన్నారు. ఖర్చు తగ్గుతుందన్నారు. వేప నూనె, ట్రైకోడెర్మా విరిడి పిచికారీ చేయాలన్నారు. ఆయన వెంట ADA అనిత, MAO వరహరికుమార్, టెక్నికల్ AO సుస్మిత పాల్గొన్నారు.


