News July 18, 2024

వేముల: 21న రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు

image

వేముల మండలం భూమయ్యగారి పల్లెలో ఈనెల 21న గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన ఎద్దుల యజమానులకు మొదటి బహుమతి లక్ష రుపాయలు, ద్వితీయ బహుమతి రూ.80,000లు, 3వ రూ.60,000లు, 4వ రూ.50,000, 5వ రూ.40,000లు, 6వ రూ.30,000లు, 7వ రూ.20,000 8వ బహుమతి రూ.10,000లు అందించనున్నట్లు తెలిపారు.

Similar News

News October 1, 2024

వైవీయూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా ఆచార్య తప్పెట రాంప్రసాద్ రెడ్డి

image

వైవీయూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా తెలుగు విభాగం ప్రొఫెసర్ తప్పెట రామప్రసాద్ రెడ్డిని నియమించారు. మంగళవారం సాయంత్రం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్, ప్రొఫెసర్ కె. కృష్ణారెడ్డి తన ఛాంబరులో నియామక పత్రం అందజేశారు. ఇదివరకు ఈ స్థానంలో ఉన్న ఆచార్య రఘునాథరెడ్డి రిలీవ్ అయ్యి ప్రధాన ఆచార్యులుగా కొనసాగనున్నారు. నూతన రిజిస్ట్రార్‌కు బోధన, బోధ నేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

News October 1, 2024

కమలాపురం వద్ద చెట్టును ఢీకొన్న కళాశాల బస్సు

image

కమలాపురం పట్టణంలోని ఓ జూనియర్ కళాశాలకు చెందిన వ్యాను మంగళవారం ఉదయం చెట్టును ఢీకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే కళాశాలకు చెందిన వ్యాను విద్యార్థులను ఎక్కించుకొని వస్తుండగా కొండాయపల్లె వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉండే చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సిఉంది.

News October 1, 2024

కడప: రోడ్డు ప్రమాద ఘటనపై అనేక అనుమానాలు?

image

కడప జిల్లా YVU యూనివర్సిటీ వద్ద సోమవారం రాత్రి కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి కాళ్లు విరిగి పడిపోయిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డు ప్రమాదంగా పరిగనించి వేలూరు ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి సమయంలో ఘటన జరగడంతో కేవలం కాళ్లకు మాత్రమే కత్తితో నరికిన గాయాలు ఉండగా.. చివరికి <<14239401>>ఎవరో కాళ్లను నరికినట్లు<<>> అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసులతోపాటు వారి బంధువులు కూడా అనుమానిస్తున్నారు.