News March 15, 2025
వేమూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం వేమూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కఠివరంకు చెందిన బత్తి శ్రీధర్(28) గుంటూరుకు చెందిన తోట సోము కుమార్ లు కొల్లూరు నుంచి ద్విచక్ర వాహనంపై తెనాలి వెళుతుండగా ఎదురుగా వస్తున్న టాటా ఏసీని ఢీకొట్టారు. శ్రీధర్ అక్కడికక్కడే మృతచెందగా సోము కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికృష్ణ తెలిపారు.
Similar News
News March 16, 2025
సూర్యాపేట: రేపు ఎస్సారెస్పీ నీటి విడుదల

సూర్యాపేట జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ఆయా కట్టుకు ఈనెల 17వ తేదీ నుంచి ఆరు తడి కింద 8 రోజులపాటు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్సారెస్పీ సీఈ శివ ధర్మ తేజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయకట్టు రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని, చివరి భూములకు నీరు అందేలా సహకరించాలని సూచించారు.
News March 16, 2025
TDP నేతలపై MLA థామస్ ఆగ్రహం

పేదల అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, అభివృద్ధికి అడ్డుపడితే సహించనని పలువురు TDP నేతలపై ఎమ్మెల్యే థామస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పెనుమూరులో పర్యటించిన ఆయన.. కేవలం పార్టీలోని కొందరు నేతలు YCP నేతలతో తిరుగుతూ ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారన్నారు. తాను దేశాలు తిరిగిన నేతనని, అగ్రకులాల వారికి సలాం చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదన్నారు. తనను రెచ్చిగొడితే అంతు చూస్తానన్నారు.
News March 16, 2025
విశాఖలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

విశాఖలో ఓ బాలిక తల్లి మందలించిందని ఆత్మహత్య చేసుకుంది. MVP పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నక్కవానిపాలెంలో ఉంటున్న రమాదేవి, సురేష్ దంపతుల కుమార్తె సాయి తనూష (16) 10వ తరగతి చదువుతోంది. ఓ బాలుడితో సన్నిహితంగా మాట్లాడడం గమనించిన తల్లి తనూషాను శుక్రవారం మందలించింది. దీంతో బాలిక రాత్రి రూములో తలుపులకు గడి పెట్టుకుంది. తల్లి తలుపులు కొట్టినా తీయలేదు. చివరకు తలుపులు పగలుకొట్టగా బాలిక ఉరివేసుకుని ఉంది.