News March 4, 2025
వేమూరు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన బలిజేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బలిజేపల్లి గ్రామానికి చెందిన రైతు వేజెండ్ల పూర్ణచంద్రరావు(70) పొలంలో మొక్కజొన్న పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. కాగా మంగళవారం మోటార్ పంపు షెడ్డు వద్ద మృతి చెంది ఉండడం గమనించారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేమూరు ఎస్ఐ రవి కృష్ణ కేసు నమోదు చేశారు.
Similar News
News March 26, 2025
తాడేపల్లి: పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైఎస్ జగన్ విచారం

మత ప్రబోదకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మాజీ సీఎం వైయస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. పాస్టర్, మత ప్రబోదకుడు ప్రవీణ్ పగడాల మృతి అత్యంత బాధాకరమని, ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు.
News March 26, 2025
అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన DWO సుధారాణి

అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల వయసుకు తగిన బరువు, ఎత్తు ఉండాలని వనపర్తి సంక్షేమ అధికారిని సుధారాణి అన్నారు. బుధవారం వనపర్తిలోని బసవన్న గడ్డ అంగన్వాడీ సెంటర్‌ను ఆమె సందర్శించారు. ఆమె మాట్లాడుతూ కొంతమంది చిన్నారులు పోషకాహార లోపంతో సరైన ఎదుగుదల లేకపోవడంతో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని, వారిని గుర్తించేందుకు జిల్లాలోని అన్నిఅంగన్వాడీ సెంటర్లలో ప్రతి బుధవారం గ్రోత్ మానిటరింగ్ చేయాలని సూచించారు.
News March 26, 2025
ప్రజల్లో విశ్వాసం పెరిగేలా పోలీసింగ్ ఉండాలి: చంద్రబాబు

సచివాలయంలో బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో పోలీసు శాఖ, శాంతిభద్రతలపై చర్చ జరిగింది. సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసు శాఖకు మంచి గుర్తింపు ఉందని, రాష్ట్రంలో జీరో క్రైమ్ లక్ష్యంగా పోలీసు శాఖ వినూత్న ప్రణాళికలతో కార్యాచరణ దిశగా అడుగులేయాలన్నారు. ప్రజల్లో విశ్వాసం పెరిగేలా పోలీసింగ్ ఉండాలన్నారు. ఆధునిక టెక్నాలజీ విరివిగా ఉపయోగించుకోవాలన్నారు.