News February 10, 2025

వేయి స్తంభాల ఆలయానికి 862 ఏళ్లు

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని చారిత్రక వేయి స్తంభాల ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. కాకతీయ శిల్పకళా శైలిలో రుద్ర దేవుడు ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఆలయాన్ని నిర్మించి సుమారుగా 862 ఏళ్లు అవుతుంది. ఆలయాన్ని సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తూ శిల్పకళా సంపదను తిలకిస్తుంటారు. మీరు వేయి స్తంభాల ఆలయానికి వెళితే కామెంట్ చేయండి.

Similar News

News March 26, 2025

HYDలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం.. RAIDS

image

HYDలో వ్యభిచార ముఠాలకు పోలీసులు చెక్ పెట్టారు. మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు చేశారు. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌‌లో బంగ్లా యువతితో వ్యభిచారం చేయించడం గుర్తించారు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన కార్తీక్, ఓ కస్టమర్‌, యువతిని అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్‌లో ఫొటోలు పంపి కస్టమర్లను ఆకర్షిస్తున్నట్టు గుర్తించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోనూ ఉగాండ యువతితో వ్యభిచారం చేయిస్తూ మరో వ్యక్తి పట్టుబడ్డాడు.

News March 26, 2025

NRML: తమ్ముడు చనిపోయిన ప్రాంతంలోనే అన్న సూసైడ్

image

తమ్ముడు సూసైడ్ చేసుకున్న ప్రాంతంలోనే అన్న పురుగుమందు తాగిన ఘటన దస్తూరాబాద్ మండలంలో చోటుచేసుకుంది. గొడిసెర్యాల గ్రామానికి చెందిన నేరెళ్ళ అశోక్ (24) చిన్నాన్న కొడుకు పవన్ ఎక్స్‌రోడ్డు సమీపంలో పురుగుమందు తాగి చనిపోయాడు. అది తట్టుకోలేని అశోక్ డిప్రెషన్‌లోకి వెళ్లాడు. అదే ప్రాంతానికి వెళ్లి పురుగుమందు తాగాడు. కుటుంబీకులు జన్నారం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు.

News March 26, 2025

విశాఖ సీపీ సూచన.. సీఎం చంద్రబాబు ఆదేశాలు..!

image

రాష్ట్రంలో డీ అడిక్షన్ సెంటర్లు పెంచాలని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశంలో సూచించారు. ఒక్కో డ్రగ్‌కు ఒక్కో విధమైన ట్రీట్‌మెంట్ ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయాలని ఆదేశించారు. ఏ ప్రాంతంలో ఏ డ్రగ్ ఎక్కువగా వాడుతున్నారో తెలుసుకుంటే అక్కడ డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేయొచ్చని అధికారులకు సూచించారు.

error: Content is protected !!