News February 25, 2026

వేరుశనగలో జింక్ లోపం లక్షణాలు – నివారణ

image

వేరుశనగలో పంట నాణ్యత, దిగుబడి పెరగడానికి జింక్ చాలా కీలకం. ఈ సూక్ష్మపోషకం తగ్గినప్పుడు మొక్కలో ఎదుగుదల ఉండదు. ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఈనెలకు ఇరువైపులా తుప్పురంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని వారం వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్‌ను 3 పంటలకొకసారి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.

Similar News

News April 16, 2026

కొల్చారం: ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం: కలెక్టర్

image

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొల్చారంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరవేయడమే లక్ష్యమని ఆమె తెలిపారు. గ్రామస్థాయిలో సమస్యలను గుర్తించి, వాటిని తక్షణమే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సత్వర న్యాయం చేయాలని సూచించారు.

News April 16, 2026

రాత్రి బ్రష్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా?

image

రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేయడం ఎంతో ముఖ్యమని వైద్యులు సూచించారు. ‘రోజంతా తిన్న ఆహారం, చక్కెర దంతాలపై ఒక పొరలా పేరుకుపోతాయి. రాత్రి బ్రష్ చేయకపోతే గంటల తరబడి అలాగే ఉండి బాక్టీరియా పెరుగుతుంది. అది ఎనామెల్‌ను దెబ్బతీసి కావిటీస్, చిగుళ్ల సమస్యలకు దారి తీస్తాయి. నోటి దుర్వాసన పెరుగుతుంది. అందుకే రాత్రి భోజనం చేశాక నిద్ర పోయే ముందు బ్రష్ చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
Share It