News July 5, 2024
వేరుశనగ నూనె ట్యాంకర్ బోల్తా.. ఎగబడ్డ జనం
కాకినాడ నుంచి HYD నూనె లోడుతో వెళుతున్న ట్యాంకర్ దమ్మపేట మండలం మొద్దులగూడెం వద్ద బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా ఈ ప్రమాదం జరిగింది. నూనె కోసం జనాలు ఎగబడ్డారు. క్యాన్లలో నింపుకుని వెళ్లారు. కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి.
Similar News
News October 16, 2024
సన్నబియ్యానికి రూ.500 బోనస్ ఇస్తాం: మంత్రి తుమ్మల
నల్గొండ ఎస్ఎల్‌బీసీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తుమ్మల చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
News October 16, 2024
చిరుత పులి సంచరిస్తుంది.. జాగ్రత్తగా ఉండండి: సీఐ ఇంద్రసేనారెడ్డి
ఏన్కూర్, జూలూరుపాడు మండల ప్రాంతాలలో చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారని సీఐ ఇంద్రసేనా రెడ్డి అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు, ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటికి వెళ్లకపోవడం మంచిదని చెప్పారు. చిరుత కనబడితే తమకు సమాచారం అందించాలని కోరారు.
News October 16, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} మధిరలో కొనసాగుతున్న పశువుల గాలి కుంట టీకాలు
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} పినపాకలో ఎమ్మెల్యే పాయం పర్యటన