News March 20, 2025

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి..

image

కర్లపాలెం మండలం యాజలికి చెందిన ప్రవీణ్ కుమార్(15) ఈతకు వెళ్లి బుధవారం మృతి చెందాడు. ఎస్ఐ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. యాజలిలోని పంట పొలాల్లో 20 అడుగుల లోతు ఉన్న ఓ గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు తెలిపారు. మరో ఘటనలో పిట్టలవానిపాలెం మండలం గోకరాజునల్లి బోయినవారిపాలెంలో విద్యుత్ షాక్ తగిలి కలుసు బేబీ(6) అనే బాలిక మృతి చెందింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Similar News

News March 28, 2025

నవ భారత నిర్మాణం యువత ద్వారానే సాధ్యం: కరీముద్దీన్

image

నవ భారత నిర్మాణం యువత ద్వారానే సాధ్యమని అబ్దుల్ కలాం ఆజాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎస్‌కే కరీముద్దీన్ అన్నారు. సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నైతిక సామాజిక విలువలు పెంపొందించేందుకు ఎన్ఎస్ఎస్ దోహదపడుతుందని చెప్పారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ రత్న ప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు.

News March 28, 2025

కొలికపూడి వ్యవహారంపై నివేదిక కోరిన టీడీపీ

image

AP: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై TDP అధిష్ఠానం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అందరినీ కలుపుకుని వెళ్లాలని చెప్పినా ఆయనలో మార్పురాలేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 10 నెలలుగా తిరువూరులో జరిగిన ఘటనలపై నివేదిక ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు, సమన్వయకర్త, ఎంపీని ఆదేశించింది. తాజాగా టీడీపీ నేత రమేశ్ రెడ్డిపై అధిష్ఠానం చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని కొలికపూడి <<15904325>>హెచ్చరించిన<<>> విషయం తెలిసిందే.

News March 28, 2025

బంగారు కవచాలతో భద్రాద్రి రామయ్య దర్శనం

image

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారు శుక్రవారం సందర్భంగా బంగారు కవచాలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉపాలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీతాయారు అమ్మవారికి విశేషాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి బేడా మండపంలో సంధ్యా హారతులు, ఉత్సవాన్ని జరపనున్నారు. ఈ అభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, తిలకించారు.

error: Content is protected !!