News March 24, 2025
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన ఘటన దమ్మపేట మండలంలో జరిగింది. మండలంలోని ముష్టిబండ శివారులో తెల్లవారుజామున లారీ, డీసీఎం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాగాలాండ్‌కి చెందిన ఆశిష్ పాలె మృతి చెందాడు. అశ్వారావుపేట మం. నారంవారిగూడెం బంధువుల ఇంటికి వెళ్తుండగా గాంధీనగర్ వద్ద గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న సరస్వతి, కృష్ణ అనే తల్లికొడుకులు మృతి చెందారు.
Similar News
News November 24, 2025
అది మీ తప్పు కాదు

ప్రేమలో విఫలం అయిన తర్వాత చాలామంది తమ లోపాల వల్లే అలా అయిందని బాధపడుతుంటారు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు డిప్రెషన్‌కు కారణమవుతాయంటున్నారు నిపుణులు. వాళ్ల ఆలోచనలు, గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం సరికాదు. సానుకూల దృక్పథం, స్వీయ ప్రేమను అలవర్చుకొని జీవితంలో ముందుకు సాగాలి. ఎంత ప్రయత్నించినా బాధ నుంచి బయటపడలేకపోతుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.
News November 24, 2025
ముగిసిన ఐబొమ్మ రవి విచారణ.. కీలక విషయాలు వెలుగులోకి!

మూవీ పైరసీ కేసులో ఐబొమ్మ రవి 5 రోజుల పోలీసు విచారణ ముగిసింది. స్నేహితుడు నిఖిల్‌తో కలిసి రవి డేటా హ్యాండ్లింగ్, సర్వర్ యాక్సెస్ వంటి అంశాల్లో పాల్గొన్నట్లుగా సమాచారం. టెలిగ్రామ్ యాప్ ద్వారా పైరసీ సినిమాల కొనుగోలు, USDT చెల్లింపులు, APK లింక్స్‌తో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసినట్లు తెలుస్తోంది. విచారణ ముగిశాక రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.
News November 24, 2025
సిరిసిల్ల: ‘అర్హులందరికీ వెంటనే పదోన్నతులు కల్పించాలి’

అర్హులైన సెస్ ఉద్యోగులందరికీ వెంటనే పదోన్నతి కల్పించాలని విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నలవాల స్వామి డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు కర్నాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం సిరిసిల్ల సెస్ కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. పదోన్నతులు కల్పించడంలో ఆలస్యం చేయడంతో అర్హులైన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.


