News February 11, 2025
వేల్పూరులో బర్డ్ ఫ్లూ నిర్ధారణ: జిల్లా కలెక్టర్

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుండడంతో జిల్లా కలెక్టర్ నాగరాణి మంగళవారం అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. తణుకు మండలం వేల్పూరులోని కృష్ణానంద పౌల్ట్రీ ఫామ్ లో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు చెప్పారు. వేల్పూరు నుంచి పది కిలోమీటర్ల వరకు అలర్ట్ జోన్ ప్రకటించారు. చికెన్, కోడిగుడ్లు అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. అన్ని షాపులను మూసివేయాలని సూచించారు.
Similar News
News March 28, 2025
ప.గో: 15 ఉపసర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15 గ్రామ పంచాయతీల పరిధిలోని ఉపసర్పంచ్‌ల స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 15 ఉప సర్పంచుల స్థానాల్లో ఆయా వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ప్రశాంతంగా ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మరోవైపు పదవీకాలం కేవలం 9 నెలలు మాత్రమే ఉండడంతో ఈ ఎన్నికపై పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదు.
News March 28, 2025
ప.గో: రెండు రోజులు జాగ్రత్త

రానున్న రెండు రోజులు ప.గో జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవాళ తాడేపల్లిగూడెంలో 40.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే పెంటపాడు, తణుకులో 40.6, అత్తిలి, ఆకివీడులో 40.1, ఇరగవరంలో 39.8, ఉండిలో 39.6, పెనుమంట్రలో 39.3, పెనుగొండలో 39.2, పాలకోడేరులో 39.1 డిగ్రీల ఎండ కాస్తుంది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. టోపీ, గొడుగు వాడాలి.
News March 28, 2025
వడలిలో మందాలమ్మని దర్శించుకున్న కోర్ట్ చిత్ర నటుడు

వడలి గ్రామ దేవత మందాలమ్మను కోర్ట్ చిత్ర నటుడు శ్రీనివాస్ భోగి రెడ్డి గురువారం దర్శించుకున్నారు. కోర్టు చిత్రంలో శ్రీనివాస్ భోగి రెడ్డి జడ్జిగా నటించారు. కుటుంబ సమేతంగా వడలివచ్చి అమ్మవారికి పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. వడలి గ్రామస్తులు చూపుతున్న ఆదరాభిమానాలు మరువలేనివి అన్నారు. కోర్ట్ చిత్రాన్ని ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారు.