News March 10, 2025
వేల్పూర్: బంగారంతో ICC ఛాంపియన్స్ ట్రోఫీ

నిజామాబాద్ వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన స్వర్ణకారుడు మంచిర్యాల నవీన్ కుమార్ 0.080 మిల్లీ గ్రాముల బంగారంతో ICC ఛాంపియన్స్ ట్రోఫీ నమూనా తయారు చేశారు. ఇండియా జట్టు ఫైనల్ గెలవాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేసినట్లు నవీన్ తెలిపాడు. నవీన్‌ను గ్రామ ప్రజలు, క్రీడాకారులు, తోటి స్నేహితులు అభినందించారు.
Similar News
News February 23, 2026
NZB: మెడల్స్ సాధించిన సిబ్బందిని అభినందించిన సీపీ

4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026లో మెడల్స్ సాధించిన NZB సిబ్బందిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. వివిధ విభాగాల్లో పాల్గొన్న పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిబ్బంది 4 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 9 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. సీపీ మాట్లాడుతూ.. భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు.
News February 23, 2026
NZB: కలెక్టరేట్ ప్రజావాణికి 107 ఫిర్యాదులు

NZB కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 107 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ZP సీఈఓ సాయాగౌడ్ తదితరులకు విన్నవించి అర్జీలు అందజేశారు. ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
News February 23, 2026
NZB: అందరి సహకారంతో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు

అందరి సహకారంతో జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల ఎన్నికలు సాఫీగా ముగిసిన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో ఎన్నికల విధుల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారులను కలెక్టర్ సన్మానించారు.


