News August 12, 2024

వేల కోట్ల కేంద్ర నిధులు నిర్వీర్యం చేశారు: దేవినేని ఉమ

image

ఎన్టీఆర్: వైసీపీ పాలకులు వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులు నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద కేంద్రం రూ.16,483 కోట్లు ఇస్తే, జగన్ తన అసమర్థతతో 20% కూడా ఖర్చు పెట్టలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన తాగునీరు ఇవ్వకుండానే జగన్ తన అవినీతితో అస్మదీయుల జేబులు నింపారని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

Similar News

News October 17, 2025

కృష్ణా: ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

image

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన కలెక్టర్ పలువురు ఉద్యోగుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఉద్యోగులు విన్నవించిన వివిధ సమస్యలను ఆయన ఓపిగ్గా ఆలకించి పరిష్కారంపై సంబంధిత అధికారులతో మాట్లాడారు.

News October 17, 2025

ప్రసూతి మరణాల నివారణకి చర్యలు: కలెక్టర్

image

ప్రసూతి మరణాలు సంభవించకుండా వైద్య ఆరోగ్య శాఖాధికారులు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం తన ఛాంబర్‌లో వైద్యాధికారులతో సమావేశమైన కలెక్టర్ ప్రసూతి మరణాలపై సమీక్షించారు. మాతృత్వ మరణాలను నివారించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. హైరిస్క్ ప్రెగ్నెంట్ కేసుల విషయంలో వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News October 17, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా రహదారుల భద్రత సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అజెండా అంశాలపై సమీక్షించిన కలెక్టర్, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.