News February 5, 2025

వేసవిలో తాగునీటి ఎద్దడి ఉండొద్దు: భద్రాద్రి కలెక్టర్

image

వేసవిలో తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయం మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా పది రోజుల ప్రత్యేక కార్యచరణ ద్వారా తాగునీటి సరఫరాలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

Similar News

News January 4, 2026

BCB రిక్వెస్ట్.. శ్రీలంకలో బంగ్లా మ్యాచులు!

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు ఇరు దేశాల మధ్య <<18748860>>క్రికెట్‌పై<<>> ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో T20WCలో తమ మ్యాచులు భారత్‌ నుంచి మార్చాలని BCB రిక్వెస్ట్ చేసింది. దీనిపై ICC సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్ స్టేజ్‌లో భారత్‌లో జరగాల్సిన బంగ్లా మ్యాచులను శ్రీలంకకు మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే 48గంటల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని క్రిక్ బజ్ పేర్కొంది.

News January 4, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

♦︎బారువ హైవేపై రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి
♦︎SKLM: 108పై దుష్ప్రచారాలు మానుకోవాలి
♦︎దేశంలో మొదటిసారిగా ఏపీలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గింపు: అచ్చెన్న
♦︎టెక్కలి: మద్యం మత్తులో చనిపోతానంటూ వ్యక్తి హల్‌చల్
♦︎కంచిలి: రైలు పైకెక్కి వ్యక్తి హల్‌చల్
♦︎ఉత్తరాంధ్ర అభివృద్ధికి బీజం పడింది: రామ్మెహన్
♦︎ పొందూరులో నూతన డీటీఎఫ్ కార్యవర్గం ఎంపిక

News January 4, 2026

కర్నూలులో కడుపుబ్బా నవ్వించిన జబర్దస్త్ టీమ్

image

కర్నూలులో జబర్దస్త్ టీమ్ కడుపుబ్బ నవ్వించారు. ఆదివారం టీజీవి కళాక్షేత్రంలో 2026 సంవత్సరం మొదటి ప్రదర్శనగా జబర్దస్త్ కామెడీ షోను ఏర్పాటు చేశారు. పారిశ్రామికవేత్త బీవీ రెడ్డి, విద్యావేత్తలు కేవీఎన్ రాజశేఖర్, పుల్లయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంవత్సరం మొత్తం శ్రోతలకు ఆనందం, వినోదం అందించే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వారు కోరారు.