News February 5, 2025
వేసవిలో తాగునీటి ఎద్దడి ఉండొద్దు: భద్రాద్రి కలెక్టర్

వేసవిలో తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయం మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా పది రోజుల ప్రత్యేక కార్యచరణ ద్వారా తాగునీటి సరఫరాలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
Similar News
News February 18, 2025
అనంతపురం జిల్లాలో మండే ఎండలు.. జాగ్రత్త!

అనంతపురం జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఆదివారం, సోమవారం 36.21°C నమోదైంది. దీంతో ఈ ఎండల్లో మంచినీళ్లతో పాటు తరచుగా ఇతర ద్రవపదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని, కాస్త వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
News February 18, 2025
చిత్తూరు జిల్లాలో మండే ఎండలు.. జాగ్రత్త!

జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నేటి నుంచే పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు రాబోతున్నాయని, అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీలు నమోదయ్యే సూచనలు కన్పిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల గరిష్ఠంగా నమోదవుతాయన్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
News February 18, 2025
HYD: మనవడి చేతిలో తాత హత్య.. కత్తి స్వాధీనం

HYDలోని సోమాజిగూడలో మనవడి చేతుల్లో తాత జనార్దనరావు హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే పోలీసులు మనవడు కీర్తితేజను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 4 రోజుల కస్టడీ సోమవారం ముగియగా.. బీఎస్ మక్తాలోని ప్రార్థన మందిరం సమీపంలో హత్యకు ఉపయోగించిన కత్తి, ధరించిన దుస్తులను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కాగా మంటల్లో కాలిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.